ghattamaneni Ramesh Babu: టాలీవుడ్ లో మరో విషాద ఘటన నెలకొంది. సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు ప్రిన్స్ మహేష్ బాబు అన్నయ్య నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ (56) అనారోగ్యంతో మరణించారు. దీంతో టాలీవుడ్ ఒక్కసారిగా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. రమేష్ బాబు మృతికి పలువురు సినీ నటులు సంతాపం తెలియజేస్తున్నారు. జనసేన అధినేత , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోషల్ మీడియా వేదికగా రమేష్ బాబు మృతికి సంతాపం తెలియజేస్తూ.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
నటుడు, నిర్మాత ఘట్టమనేని రమేష్ బాబు కన్నుమూశారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని అన్నారు. రమేష్ బాబు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రముఖ నటులు సూపర్ స్టార్ కృష్ణ నట వారసత్వాన్ని కొనసాగించి అనంతరం చిత్ర నిర్మాణంలోకి వచ్చి విజయాలు అందుకున్నారని గుర్తు చేశారు పవన్. సోదరుడు మహేష్ బాబుతో ‘అర్జున్’ లాంటి భారీ చిత్రాన్ని నిర్మించారు. కృష్ణ ఇప్పుడు పుత్రశోకాన్ని దిగమింగుకోవాల్సిన క్లిష్ట సమయమిది. ఆయనకు, కుటుంబ సభ్యులకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని చెప్పారు పవన్ కళ్యాణ్.
Also Read: