AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OG Universe: పవన్ ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్.. ‘ఓజీ 2’ గ్లింప్స్ వచ్చేసింది.. సమురాయ్‌గా పవర్ స్టార్ విధ్వంసం

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు బర్త్ డే ట్రీట్ వచ్చేసింది. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ యూనివర్స్ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ మేరకు ఓజీ కాన్సెప్ట్ ఎలా ఉంటుందో చెబుతూ ఒక ప్రత్యేకమైన వీడియోను విడుదల చేశారు.

OG Universe: పవన్ ఫ్యాన్స్‌కు బర్త్ డే ట్రీట్.. 'ఓజీ 2' గ్లింప్స్ వచ్చేసింది.. సమురాయ్‌గా పవర్ స్టార్ విధ్వంసం
Pawan Kalyan OG Universe
Basha Shek
|

Updated on: Sep 02, 2026 | 6:27 PM

Share

ఇవాళ (సెప్టెంబర్ 02) పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టిన రోజు. దీంతో పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. అలాగే అభిమానులు, నెటిజన్లు కూడా సోషల్ మీడియా వేదికగా పవర్ స్టార్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇక ఇదే సందర్భాన్ని పురస్కరించుకుని పవన్ కల్యాణ్ అభిమానులకు బర్త్ డే ట్రీట్ ఇచ్చారు ఓజీ మేకర్స్. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తోన్న స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఓజీ యూనివర్స్ కు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈమేరకు ఓజీ సీక్వెల్ ఎలా ఉంటుందో వివరిస్తూ ఒక చిన్న గ్లింప్స్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ‘ఓజీ యూనివర్స్’  గురించి పవన్ కల్యాణ్, డైరెక్టర్ సుజీత్, తమన్ మధ్య జరిగిన హాట్ డిస్కషన్స్ ను మనం చూడవచ్చు. ఈ సందర్భంగా  తమన్ ఓజీ సీక్వెల్ గురించి కొన్ని క్రేజీ విషయాలు పంచుకున్నారు. ఓజీ 2 సినిమాను మన ఇండియా బ్యాక్‌డ్రాప్‌లో, సౌత్ ఈస్ట్ ఏషియన్ ఎమోషన్స్, వెస్ట్రన్ ప్రజెంటేషన్‌తో ప్లాన్ చేశామని థమన్ అన్నారు. ఇప్పటి నుంచి కొత్త బ్లడ్ గ్రూప్ ఓజీ అని తమన్ అనగా.. ఓజీ యూనివర్సల్ బ్లడ్ గ్రూప్ అని సుజీత్ అనడం విశేషం.

ఇక ఇదే చర్చలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొని ఓజీ యూనివర్స్ పై పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  ‘ఈ కథలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్ నుంచి సమకాలీన అంశాల వరకు అన్నీ యాడ్ చేస్తే అది నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుందని సలహా ఇచ్చారు. చివరకు  ‘మనం బెస్ట్ అవుట్‌పుట్ ఇద్దాం* అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు పవర్ స్టార్ ఫ్యాన్స్ ను తెగ ఖుషీ చేస్తున్నాయి.  ఇక వీడియో చివర్లో వచ్చిన యానిమేషన్ విజువల్స్ హైలైట్ అని చెప్పవచ్చు.  సమురాయ్ స్టైల్ కత్తి యుద్ధాలు, అలాగే జపనీస్ కటానా కత్తులతో పవన్ కళ్యాణ్ విన్యాసాలు.. ఓజీ సీక్వెల్ పైఅంచనాలను అమాంతం పెంచేశాయి. త్వరలోనే ఈ క్రేజీ సీక్వెల్ నుంచి మరిన్ని అప్డేట్స్ రానున్నాయి.

డైరెక్టర్ సుజిత్ ట్వీట్..

ఓజీ యూనివర్స్ గ్లింప్స్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
చొక్కాతో అద్దాలు తుడుస్తున్నారా? ఖరీదైన లెన్స్‌ను పాడుచేసుకోకండి!
చొక్కాతో అద్దాలు తుడుస్తున్నారా? ఖరీదైన లెన్స్‌ను పాడుచేసుకోకండి!
మీకు హెచ్ఐవీ రిస్క్‌ ఉందో లేదో QR కోడ్‌తో తెలుసుకోవచ్చు..
మీకు హెచ్ఐవీ రిస్క్‌ ఉందో లేదో QR కోడ్‌తో తెలుసుకోవచ్చు..
శుక్రుడి ఎంట్రీతో జాక్‌పాట్.. ఈ రాశులకు డబ్బే డబ్బు!
శుక్రుడి ఎంట్రీతో జాక్‌పాట్.. ఈ రాశులకు డబ్బే డబ్బు!
స్వరా వాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు
స్వరా వాఖ్యలు మహిళలను అవమానించేలా ఉన్నాయని ఆరోపణలు
టెస్ట్ క్రికెట్‌లో అంత్యంత చెత్త రికార్డు.. 26 పరుగులకే ఆలౌట్!
టెస్ట్ క్రికెట్‌లో అంత్యంత చెత్త రికార్డు.. 26 పరుగులకే ఆలౌట్!
పెళ్లికి పదేపదే అడ్డంకులా? జ్యోతిష్యంలో చెప్పిన చిట్కాలివే!
పెళ్లికి పదేపదే అడ్డంకులా? జ్యోతిష్యంలో చెప్పిన చిట్కాలివే!
సామాన్యులపై మరో భారం.. ఘాటెక్కిస్తున్న ఉల్లి.. ఇప్పుడు కిలో..
సామాన్యులపై మరో భారం.. ఘాటెక్కిస్తున్న ఉల్లి.. ఇప్పుడు కిలో..
దొంగతనం చేయడానికి వచ్చి.. వెంకటేశ్వరస్వామి ఫోటో కనిపించగానే..
దొంగతనం చేయడానికి వచ్చి.. వెంకటేశ్వరస్వామి ఫోటో కనిపించగానే..
శని దేవుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదట!
శని దేవుడి అనుగ్రహం.. ఈ రాశుల వారికి ఇక తిరుగులేదట!
ఈసారి అంతకు మించి.. పవన్ కల్యాణ్ 'ఓజీ 2' గ్లింప్స్ చూశారా?
ఈసారి అంతకు మించి.. పవన్ కల్యాణ్ 'ఓజీ 2' గ్లింప్స్ చూశారా?