విక్టరీ వెంకటేష్(Venkatesh), మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్(Varun Tej) కాంబినేషన్లో వస్తున్న మూవీ ఎఫ్3(F3 ). అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ కంప్లీట్ కమర్షియల్ ప్యాకేజీ. నాన్ స్టాప్ నవ్వులతో పాటు తమన్నా, మెహ్రీన్, సోనాల్ చౌహాన్ రూపంలో ఎఫ్3కి అదిరిపోయే గ్లామర్ కూడా వుంది. అంతేకాదు గ్లామరస్ క్వీన్ పూజా హెగ్డే పార్టీ సాంగ్ లో అలరించబోతుంది. ఇన్ని స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్న ఎఫ్ 3 మూవీ మే 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ ను మే 17న విడుదల చేయనున్నారు. ‘లైఫ్ అంటే ఇట్లా వుండాలా” అనే పాట.. పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ కానుంది. ఈ పాట ప్రోమోను విడుదల చేయనున్నారు. ఈ మేరకు అప్డేట్ ను ఇచ్చారు మేకర్స్.
రేపు(మే 16న) ఉదయం 10:08 గంటలకు ఈ సాంగ్ ప్రోమో విడుదల కానుంది. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ .. పర్ఫెక్ట్ పార్టీ పోస్టర్ గా నిలిచింది. పూజా హెగ్డే, వెంకటేష్, వరుణ్ తేజ్ జిగేల్ అనిపించే పార్టీవేర్‌లో కనిపించారు. బ్లాక్ అండ్ బ్లాక్ అవుట్ పిట్స్ లో స్పెషల్ పార్టీ సాంగ్ కి తగ్గట్టు మెరిశారు. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ పార్టీ సాంగ్ కోసం క్యాచి, గ్రూవీ నెంబర్ ని ట్యూన్ చేసారు. ఈ పార్టీ సాంగ్ సినిమాలో ప్రత్యేక ఆకర్షణలలో ఒకటిగా ఉండబోతుంది. ఎఫ్3 స్టార్ కాస్ట్ అంతా కనిపించేబోయే ఈ పాట ప్రేక్షకులకు విజువల్ ఫీస్ట్ కానుంది. ఈ పార్టీ సాంగ్ ని చిత్ర యూనిట్ ప్రకటించినప్పటి నుండి.. అందరిలోనూ ఆసక్తిపెరిగింది. లిరికల్ వీడియోను విడుదల చేయడానికి ముందు పోస్టర్, ప్రోమోలను విడుదల చేస్తూ ఆ ఆసక్తిని ఇంకా పెంచింది చిత్ర యూనిట్.
గతవారం విడుదలైన ఎఫ్ 3 ట్రైలర్ ప్రేక్షకులను అలరిస్తోంది. 20 మిలియన్లకు పైగా వ్యూస్ తో గత 6 రోజులుగా యూట్యూబ్‌లో ఎఫ్ 3 ట్రైలర్ ట్రెండింగ్‌లో ఉంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ‘ఎఫ్3 ‘ ఫ్యామిలీ అండ్ ఫన్ ఎంటర్‌టైనర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిర్మాత దిల్ రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు వున్నాయి. ప్రేక్షకులకు నవ్వులు పంచడానికి మే 27న ఎఫ్ 3 ప్రపంచవ్యాప్తంగా భారీ విడుదల కానుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :