Samuthirakani: మహేష్ ఎదురుగా నటించడం అంత తేలికైన విషయం కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సముద్రఖని

విలక్షణ నటనతో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు నటుడు సముద్రఖని. దర్శకుడిగా , రచయితగా రాణించిన సముద్రఖని ఇప్పుడు విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు.

Samuthirakani: మహేష్ ఎదురుగా నటించడం అంత తేలికైన విషయం కాదు.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సముద్రఖని
Samuthirakani Mahesh Babu
Follow us
Rajeev Rayala

|

Updated on: May 15, 2022 | 4:27 PM

విలక్షణ నటనతో ఆకట్టుకుంటూ దూసుకుపోతున్నారు నటుడు సముద్రఖని(Samuthirakani). దర్శకుడిగా , రచయితగా రాణించిన సముద్రఖని ఇప్పుడు విలన్ పాత్రలతో ఆకట్టుకుంటున్నారు. అలవైకుంఠపురంలో, క్రాక్, భీమ్లానాయక్ లాంటి సినిమాలతో అదరగొట్టిన సముద్ర ఖని.. తాజాగా సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలో విలన్ గా నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఎంపీ రాజేంద్రనాథ్ పాత్రలో సముద్రఖని నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. బ్యాంక్ ఉంచి వేల కోట్ల అప్పు తీసుకొని ఎగ్గొట్టే వ్యక్తిగా సముద్రఖని నటన మెప్పించింది. తాజాగా సర్కారు వారి పాట సినిమా గురించి సముద్రఖని మాట్లాడుతూ.. సినిమా పై మహేష్ బాబు నటన పై ప్రశంసలు కురిపించారు.

‘సర్కారివారి పాట’ సినిమాలో విలన్ పాత్ర కోసం దర్శకుడు పరశురామ్  చాలా మంది పేర్లను పరిశీలించాడట. అప్పుడు మహేశ్ బాబు  నా పేరును సూచించడం వలన నాకు అవకాశం వచ్చింది. మహేశ్ బాబుకి ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. అలాంటి ఒక సూపర్ స్టార్ నోటి నుంచి నా పేరు రావడం నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను అని అన్నారు సముద్రఖని. మహేశ్ బాబు గారు చాలా గొప్ప ఆర్టిస్ట్. మహేష్ బాబు ‘మురారి’ సినిమాను ఎన్ని సార్లు చూశానో నాకే తెలియదు అన్నారు సముద్రఖని. అలాగే  ‘మహర్షి’ .. ‘భరత్ అనే నేను’ సినిమాలను కూడా చాలాసార్లు చూశాను. ఆయన బాడీ లాంగ్వేజ్ .. డైలాగ్ డెలివరీ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. మహేష్ బాబు తెరపై కనిపిస్తే ఆయనను మాత్రమే చూస్తుంటాను .. ఆ చుట్టుపక్కల ఏం జరుగుతుందనేది పట్టించుకోను. అలాంటి ఒక హీరో.. ఈ సినిమా కోసం నన్ను సిఫార్స్ చేయడం నిజంగా నాకు చాలా సంతోషాన్ని కలిగించే విషయం అని చెప్పుకొచ్చారు సముద్రఖని. మహేష్ ఎదురుగా నిలబడి ఆయనను చూస్తూ నటించడమనేది అంత తేలికైన విషయమేం కాదు. మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ రావడమనేది ఒక గిఫ్ట్ లాంటిది అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Udhayanidhi Stalin: తమిళ హీరో షాకింగ్‌ నిర్ణయం.. సినిమాలకు గుడ్‌బై చెప్పనున్న స్టాలిన్‌!

Karate Kalyani: కరాటే కళ్యాణిపై మరో కేసు నమోదు.. ఆ విషయంలో బాధితుడు ఫిర్యాదు చేయడంతో..

Akshay Kumar: అక్షయ్‌కుమార్‌కి రెండోసారి కరోనా పాజిటివ్‌.. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కి దూరం..

ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
ఏపీ, తెలంగాణ మధ్య పోటీ అవసరం లేదు: సీఎం రేవంత్ రెడ్డి
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
హిమాయత్ నగర్‌ మినర్వా హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం..
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
సంక్రాంతి తర్వాత ఆ రాశుల వారికి ఆర్థిక విజయాలు
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
హైదరాబాదీలకు గుడ్ న్యూస్.. ఇక ఆ మార్గంలో ట్రాఫిక్ కష్టాలకు చెక్
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
రవి, శనుల యుతి.. ఆ రాశుల వారికి అధికార యోగం పక్కా..!
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
22 బంతుల్లోనే 106 రన్స్..17 ఏళ్ల కుర్రాడి వైల్డ్ ఫైర్ ఇన్నింగ్స్
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
పది మంది కడుపు నింపుతున్న ఈ వ్యక్తి గురించి సలాం కొట్టాల్సిందే!
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
దబిడి దిబిడి సాంగ్‌పై ట్రోల్స్.. బాలకృష్ణ సంచలన ట్వీట్
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
అకౌంట్లో డబ్బులు పడ్డాయని బ్యాలెన్స్‌ చెక్‌ చేశారంటే అంతే సంగతి..
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!
నోరూరించే టమాటా వెల్లుల్లి చట్నీ.. వేడి అన్నంతో తింటే రుచే వేరు!