సిల్వర్ స్క్రీన్ పై బాహుబలిలా అందర్నీ మెస్మరైజ్ చేయడమేకాదు.. మర్యాద విషయంలోనూ.. రియల్ లైఫ్ బాహుబలిలా అనిపించుకుంటారు ప్రభాస్. తన కో స్టార్స్‌కు… తన సన్నిహితులకు ఎప్పుడూ మరిచిపోలేని ఆతిథ్యాన్ని ఇస్తూనే ఉంటారు. అమోఘమైన తన ఇంటి వంటకాల రుచులను వారికి పరిచయం చేస్తుంటారు. తన మనసు మాత్రమే కాదు.. పెట్టే చేయి కూడా పెద్దదే అనే టాక్ వచ్చేలా చేసుకుంటారు. ఇక ఇప్పుడో యంగ్ డైరెక్టర్ చేత కూడా ఇంచు మించు ఇలాంటి లవ్లీ రియాక్షనే వచ్చేలా చేసుకున్నారు.
ఫిల్మ్ ఇండస్ట్రీలో రైటర్ కమ్ డైరెక్టర్‌గా రాణిస్తున్న సాయి రాజేష్.. ఎట్ ప్రజెంట్ ఆనంద్ దేవరకొండ హీరోగా బేబీ సినిమాను తెరకెక్కించే పనిలో ఉన్నారు. తొందర్లో ఈ సినిమాను మన ముందుకు తీసుకొచ్చేందుకు కష్టపడతున్నారు. కానీ ఈ క్రమంలోనే తాజాగా పాన్ ఇండియన్ సూపర్ స్టార్ హోమ్ ఫుడ్ టేస్ట్ చేస్తున్నా.. అంటూ తన ట్విట్టర్ హ్యండిల్లో ట్వీట్ చేశారు.
అంతేకాదు ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన వంటకాలు కీమా ఫ్రాన్ పులావ్, మటన్ పులావ్, ఎగ్ నూడుల్స్, చికెన్ మంచూరియా వెట్.. ఫోటోలను కూడా ట్విట్టర్లో షేర్ చేశారు ఈ యంగ్ డైరెక్టర్. షేర్ చేయడమే కాదు.. ఇప్పుడీ ట్వీట్‌తో.. ప్రభాస్ హాస్పిటాలిటీ.. మరో సారి అందరికీ తెలిసేలా చేశారు. ప్రభాస్ దావత్ అంటే మామూలుగా ఉండదు అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నారు.
Naaloni #foodie ki Memorable day ? ..
Tasting Pan India SUPER STAR’s Home Food ???Kheema Prawn Pulao
Mutton Pulao
Egg Noodles
Chicken Manchuria Wet
Heavennnnnnnnnn ???? pic.twitter.com/G6TwqrEZmt— Sai Rajesh (@sairazesh) April 16, 2023