“పల్లవి ప్రశాంత్‌ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారు”.. ప్రజావాణిలో ఫిర్యాదు

బిగ్‌బాస్‌ ఫైనల్స్‌ సమయంలో జరిగిన ఘర్షణల్లో TSRTCకి చెందిన 6 బస్సులు దెబ్బతిన్నాయని, పోలీసు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయని హైదరాబాద్‌ వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమర్‌ తెలిపారు. ప్రశాంత్‌ను అక్కడి నుంచి వెళ్లిపొమ్మని ముందే చెప్పామన్నారు. కానీ, పోలీసుల మాట వినకుండా అతడు మళ్లీ వెనక్కి వచ్చారని వివరించారు. ఎక్కువ మంది గుమిగూడి ఘర్షణ తలెత్తడానికి ప్రశాంతే కారణమయ్యారని డీసీపీ చెప్పారు.

పల్లవి ప్రశాంత్‌ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారు.. ప్రజావాణిలో ఫిర్యాదు
Pallavi Prashanth

Updated on: Dec 22, 2023 | 2:03 PM

పల్లవి ప్రశాంత్‌ అరెస్టుపై పోలీసులు స్పందించారు. త్వరలో బిగ్‌బాస్‌ నిర్వాహకులను కూడా ప్రశ్నిస్తామన్నారు. పల్లవి ప్రశాంత్‌ కావాలనే.. అక్కడున్న యువకులను రెచ్చగొట్టాడని ప్రకటించారు డీసీపీ విజయ్‌. శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పల్లవి ప్రశాంత్‌ను వేరే దారిలో పంపించామని.. పాపులారిటీ కోసమే.. మళ్లీ వచ్చి అక్కడివారిని రెచ్చగొట్టాడని చెప్పారు డీసీపీ.

బిగ్‌బాస్‌7 విన్నర్‌ పల్లవి ప్రశాంత్‌ కేసులో ప్రజావాణిని ఆశ్రయించారు.. అతడి తరఫు లాయర్‌. ఈ మేరకు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. పల్లవి ప్రశాంత్‌ను అన్యాయంగా అరెస్ట్‌ చేశారన్న లాయర్‌.. ఈ అక్రమ అరెస్టు వెనుక రాజకీయ కుట్ర ఉందని ఆరోపించారు. పూర్తిస్థాయి విచారణ జరిపించాలని ప్రజావాణిలో సీఎంకు విజ్ఞప్తి చేశారు.

ప్రశాంత్ అరెస్ట్‌పై స్పందించిన శివాజి

పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై తాజాగా శివాజి స్పందించాడు. ప్రశాంత్‌తో నాలుగు నెలలు ఒక హౌస్‌లో ఉండి చూశానని..  చాలా మంచి కుర్రాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఒక్కోసారి గెలిచాను అన్న ఆనందం మనిషిని డామినేట్ చేయొచ్చు.. ఇది అలా జరిగిన ఇబ్బందే అని చెప్పుకొచ్చాడు. ఈ ఇష్యూ అయిన మొదటి గంట నుంచి ఈ క్షణం వరకూ ప్రశాంత్ విషయంలో ఏం జరుగుతుందో ప్రతి సమాచారం తెలుసుకుంటున్నట్లు చెప్పాడు. “పల్లవి ప్రశాంత్‌కు నేనేంటో తెలుసు. నాకు వాడేంటో తెలుసు. ప్రశాంత్ చట్టాన్ని గౌరవించే వ్యక్తి. చట్ట ప్రకారమే వాడు బయటకు వస్తాడు” అని చెప్పుకొచ్చాడు శివాజి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.