Arjith Singh: సింగర్ అర్జిత్ సింగ్‏కు పద్మ శ్రీ అవార్డ్..

గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. 7 మందికి పద్మవిభూషణ్, 119 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీలను అనౌన్స్ చేసింది. అనేక రంగాల్లో సేవలందించిన ప్రముఖులకు పద్మ పురస్కారాలను ప్రకటించింది. బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్, బాలకృష్ణ, అజిత్ కుమార్ తోపాటు మరికొంత మందికి పద్మ అవార్డులు వరించాయి.

Arjith Singh: సింగర్ అర్జిత్ సింగ్‏కు పద్మ శ్రీ అవార్డ్..
Arjith Singh, Ananth Nag

Updated on: Jan 26, 2025 | 7:09 AM

కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించిన సంగతి తెలిసిందే. 7 పద్మ విభూషణ్, 19 పద్మ భూషణ్, 113 పద్మశ్రీ అవార్డులను హోం మంత్రిత్వ శాఖ అనౌన్స్ చేసింది. సినీరంగంలో ఎంతో మంది ప్రముఖులను పద్మ అవార్డులతో సత్కరించింది. నందమూరి బాలకృష్ణతోపాటు శోభన, అజిత్ కుమార్ వంటి స్టార్ నటీనటులకు పద్మ భూషణ్ అవార్డ్స్ ప్రకటించింది. అలాగే బాలీవుడ్ సింగర్ అర్జిత్ సింగ్‏కు పద్మ శ్రీ అవార్డ్ ప్రకటించింది కేంద్రం. దీంతో అభిమానులు, సెలబ్రేటీలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. భారతీయ సినీరంగంలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న గాయకుడు అర్జిత్ సింగ్. అలాగే కళారంగంలో చేసిన కృషికి గాను మరణించిన ఇద్దరు గాయకులను కూడా సత్కరించనున్నారు. భోజ్‌పురి పరిశ్రమకు చెందిన ప్రముఖ గాయని దివంగత శారదా సిన్హా పద్మవిభూషణ్ అవార్డు ప్రకటించింది కేంద్రం.

అలాగే ప్రముఖ కన్నడ నటుడు అనంత్ నాగ్‌కు పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. దశాబ్దాలుగా కన్నడతోపాటు ఇతర భాషలలోనూ అనేక చిత్రాల్లో నటించారు అనంత్ నాగ్. కన్నడ సినిమాలతో పాటు పలు ఆల్బమ్‌లకు సంగీతం అందించిన కన్నడిగుల రికీ కేజ్‌కి పద్మశ్రీ అవార్డును ప్రకటించారు. గ్రామీ అవార్డు గ్రహీత రికీ కేజ్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. హిందీ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత, దర్శకుడు శేఖర్ కపూర్‌కు పద్మభూషణ్ అవార్డును ప్రకటించారు. ‘మిస్టర్ ఇండియా’, ‘బాండిట్ క్వీన్’, ‘ఎలిజబెత్’అనేక ప్రసిద్ధ చిత్రాలకు శేఖర్ కపూర్ దర్శకత్వం వహించారు.

ప్రముఖ నటి, నర్తకి మమతా శంకర్‌కు పద్మశ్రీ అవార్డు లభించింది. మమతా శంకర్ బెంగాలీ, హిందీ సినిమాల్లో నటించారు. జాతీయ అవార్డు కూడా అందుకున్నాడు. ఆమె చాలా మంచి డాన్సర్ కూడా. మరికొంత మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..