Chandra Bose: పుట్టిన ఊరిలో చంద్రబోస్‌కు ఆత్మీయ సత్కారం.. ఆస్కార్‌ గ్రంథాలయం ఏర్పాటుకు గేయ రచయిత హామీ

|

Apr 03, 2023 | 5:37 AM

చంద్రబోస్ స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చల్లగరిగలో చంద్రబోస్‌కి ఘన సన్మానం చేశారు. మిత్రులు, గ్రామస్తులు పూబంతులు..చేమంతులు చల్లుతూ ఘనంగా గ్రామంలోకి తోడ్కొని వెళ్ళారు. తను విద్యాభ్యాసం చేసిన పాఠశాల ఆవరణలోనే ఘనంగా సన్మానించారు. అనంతరం..

Chandra Bose: పుట్టిన ఊరిలో చంద్రబోస్‌కు ఆత్మీయ సత్కారం..  ఆస్కార్‌ గ్రంథాలయం ఏర్పాటుకు గేయ రచయిత హామీ
Chandra Bose
Follow us on

తెలుగు పాటను, తెలంగాణ నుడికారాన్నీ.. తెలుగు పల్లెజనం సంస్కృతినీ.. ప్రపంచవ్యాప్తం చేసిన నాటు నాటు పదాలకు పదునుపెట్టిన పూదోటలో అడుగుపెట్టారు నాటు నాటు గేయరచయిత చంద్రబోస్‌. భారతీయ సినిమాకి ప్రతిష్టాత్మక ఆస్కార్‌ని అందించిన నాటు నాటు పాట రచయిత చంద్రబోస్‌ని.. ఆయన స్వగ్రామంలోని చిన్ననాటి స్నేహితులు.. తన తోటి పాఠశాల మిత్రులు సన్మానించారు. మది నిండుగా ప్రశంసించారు. తన ఊరినీ..ఆ నేలను..అక్కడ అలలుగా తేలివచ్చి తనకు చిన్ననాడు రాగాలాపనలు నేర్పిన ఆ గాలినీ ముద్దాడి మురిసిపోయారు ప్రముఖ గేయరచయిత చంద్రబోస్‌. చంద్రబోస్ స్వగ్రామం జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చల్లగరిగలో చంద్రబోస్‌కి ఘన సన్మానం చేశారు. మిత్రులు, గ్రామస్తులు పూబంతులు..చేమంతులు చల్లుతూ ఘనంగా గ్రామంలోకి తోడ్కొని వెళ్ళారు. తను విద్యాభ్యాసం చేసిన పాఠశాల ఆవరణలోనే ఘనంగా సన్మానించారు చిన్ననాటి మిత్రులు. చేతిలో ఆస్కార్ అవార్డ్ పట్టుకుని గ్రామంలోకి అడుగుపెట్టిన చంద్రబోస్‌.. భావోద్వేగానికి గురయ్యారు. విశ్వయవనికపై గెలిచిన నాటు నాటు పాట చల్లగరిగ నుడికారం, చల్లగరిగ భాష, గేయం నిండా ఇమిడి ఉందన్నారు చంద్రబోస్‌. పాటలో ఉపయోగించిన పదాలన్నీ ఈ మట్టినేర్పినవేనన్నారు. పూర్తిస్థాయి ఆస్కార్ సాధించిన భారతీయ చిత్రం RRR కావడం గర్వంగా ఉందని వ్యాఖ్యానించారు.

ఆ ఊరి లైబ్రరీలోనే నాటు పాటకు బీజం పడిందనీ..నా చల్లగరిగ ప్రపంచాన్ని గెలిచిందనీ వ్యాఖ్యానించారు. నాటు నాటు పాట స్వయంగా పాటపాడి ఊరును ఉర్రూతలూగించారు. తన కష్టార్జితంతో శిథిలావస్థకు చేరిన ఈ ఊరి లైబ్రరీని పునర్ నిర్మిస్తానని ప్రకటించారు చంద్రబోస్‌. అంతేకాదు.. ఆ గ్రంధాలయానికి ఆస్కార్ గ్రంథాలయం అని పేరు పెడతానన్నారు.

ఇవి కూడా చదవండి

Chandra Bose