సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కిన ఆరెంజ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్

థియేటర్స్ లో పెద్దగా ఆడకపోయినా కల్ట్ క్లాసిక్ గా నిలిచిన సినిమాల్లో ఆరెంజ్ సినిమా ఒకటి. బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీలో రామ్ చరణ్, జెనీలియా హీరో, హీరోయిన్లుగా నటించారు. అలాగే మరో హీరోయిన్ గా షాజన్ పదంసీ నటించింది. సినిమాల్లో బాగా హైలెట్ గా నిలిచిన పాత్రల్లో షాజన్ ది కూడా ఒకటి.

సైలెంట్‌గా పెళ్లిపీటలెక్కిన ఆరెంజ్ హీరోయిన్.. సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
Shazahnpadamsee

Updated on: Jun 06, 2025 | 6:01 PM

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ప్రేమ కథా చిత్రం ఆరెంజ్. జెనీలియా హీరోయిన్ గా నటించింది. అంజనా ప్రొడక్షన్స్ పతాకంపై మెగా బ్రదర్ నాగబాబు ఈ సినిమాను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మించాడు. ఇందులోని పాటలు ఆల్ టైమ్ హిట్స్ గా నిలిచాయి. అయితే థియేటర్లలో ఆరెంజ సినిమా రిలీజైనప్పుడు ఎందుకో చాలా మందికి నచ్చలేదు. కలెక్షన్లు కూడా పెద్దగా రాలేదు. 2010లో డిజాస్టర్ గా నిలిచిన ఆరెంజ్ సినిమాను రీ రిలీజ్ చేస్తే.. కలెక్షన్ల వర్షం కురిపించడం గమనార్హం. కాగా ఇందులో మెయిన్ హీరోయిన్ గా జెనీలియా నటించగా, ప్లాష్ బ్యాక్ లో రామ్ చరణ్ ప్రియురాలు రూబాగా మరో హీరోయిన్ నటించింది. ఆ నటి పేరు షాజన్ పదంసీ. ‘రూబా రూబా హే రూబా రూబ్బా రూపం చూస్తే హాయిరబ్బా’ అని సినిమాలో రామ్ చరణ్ పాడినట్లే యూత్ కు బాగా కనెక్ట్ అయ్యింది షాజన్. సినిమాలో ఆమె కనిపించేది కొద్ది సేపే అయినా తన క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రకారును కవ్వించింది.

ఆరెంజ్ సినిమా హిట్ కాకపోయినా షాజన్ క్యూట్ నెస్ కు అందరూ ఫిదా అయిపోయారు. దీంతో ఆమె తెలుగులో బిజీ యాక్టర్ అయిపోతుందని భావించారు. అయితే అదేమీ జరగలేదు. ఆరెంజ్ తర్వాత కేవలం ఒక్క తెలుగు మూవీలో నటించింది. అదే వెంకటేశ్, రామ్ మల్టీ సార్టర్లుగా నటించిన మసాలా. ఇందులో రామ్‌కు జోడీగా నటించింది. ఆ తర్వాత హిందీలో కొన్ని సినిమాల్లో తళుక్కుమంది. దిల్ తో బచ్చా హై జీ, హౌస్ ఫుల్ 2 చిత్రాలతో సక్సెస్ సొంతం చేసుకున్నా హీరోయిన్ గా బిజీ కాలేకపోయింది. 2023లో పాగల్ పన్ మూవీతో బాలీవుడ్ ప్రేక్షకులను పలకరించినా నిరాశే ఎదురైంది. ప్రస్తుతం అడపా దడపా హిందీ సినిమాల్లో మాత్రమే కనిపిస్తోంది షాజన్.

ఇవి కూడా చదవండి

తాజాగా ఈ ముద్దుగుమ్మ పెళ్లి చేసుకుంది. గ్రాండ్‌గా ఓ బిజినెస్‪‌మ్యాన్‌ని పెళ్లి చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మూవీ మాక్స్ సినిమా సీఈఓ అయిన ఆశిష్ కనకియా.. ఓ ఫ్రెండ్ ద్వారా షాజన్‌కి పరిచయం.. గతేడాది నవంబర్‌లోనూ అశీష్‌ తనకు ప్రపోజ్ చేసినట్లు షాజన్ తెలిపింది. ఈ క్రమంలోనే ఈ ఏడాది జనవరిలో వీరి రోకా వేడుక అట్టహాసంగా జరిగింది. తాజాగా వీరి వివాహం కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య జరిగింది. గురువారం రాత్రి వివాహ వేడుక జరిగింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి