Ooru Peru Bhairavakona: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న సాంగ్.. భారీ వ్యూస్ రాబట్టిన నిజమే నే చెబుతున్నా.. పాట

|

Jul 05, 2023 | 8:59 AM

స్నేహగీతం సినిమాతో పరిచయమైన సందీప్ కిషన్ ప్రస్థానం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఆతర్వాత సందీప్ హిట్ అందుకోవడానికి చాలా కాలం పట్టింది.

Ooru Peru Bhairavakona: యూట్యూబ్‌ను షేక్ చేస్తోన్న సాంగ్.. భారీ వ్యూస్ రాబట్టిన నిజమే నే చెబుతున్నా.. పాట
Nijame Ne Chebuthunna
Follow us on

యంగ్ హీరో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఊరు పేరు భైరవకోన’ థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఈసినిమా తెరకెక్కుతోంది. సందీప్ కిషన్ సన్సెస్ కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నాడు. స్నేహగీతం సినిమాతో పరిచయమైన సందీప్ కిషన్ ప్రస్థానం సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆతర్వాత రొటీన్ లవ్ స్టోరీ సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. ఆతర్వాత సందీప్ హిట్ అందుకోవడానికి చాలా కాలం పట్టింది. నిన్ను వీడని నీడను నేనే అనే సినిమాతో ప్రేక్షకులను మెప్పించాడు. సందీప్ కిషన్ చివరిగా మైఖేల్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సందీప్ తెలుగుతో పాటు తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ఈ కుర్ర హీరో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఊరు పేరు భైరవకోన.

ఈ సినిమాకు వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సందీప్ కు జోడీగా వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమానుంచి మొన్నామధ్య ఓ అద్భుతమైన మెలోడీ సాంగ్ రిలీజ్ అయ్యింది. నిజమే నే చెబుతున్నా..
అనే పాట రిలీజే చేశారు చిత్రయూనిట్.

తాజాగా ఈ సాంగ్ యూట్యూబ్ లో రికార్డు క్రియేట్ చేసింది. సిద్ శ్రీరామ్ ఆలపించిన ఈ పాట యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను రాబట్టింది. ఈ సినిమాకు శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు. అలాగే శ్రీమణి సాహిత్యం అందించాడు. ఈ పాట మూడు కోట్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. ఇప్పటికీ ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటుంది.