తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ప్రజలందరూ చాలా ఘనంగా సంక్రాంతి పండుగను జరుపుకున్నారు. సినీ సెలబ్రెటీలు కూడా సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకున్నారు. మెగాస్టార్ ఫ్యామిలీ అంతా బెంగళూరు లో సంక్రాంతి జరుపుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా సంక్రాంతి ని ఘనంగా జరుపుకున్నారు. తెలుగు దేశం అధినేత చంద్రబాబుతో కలిసి విజయవాడలో భోగి పండుగ జరుపుకున్నారు. ఇప్పుడు కనుమ సందర్భంగా గోపూజను నిర్వహించారు పవన్ కళ్యాణ్. గోవులకు దానా వేస్తూ.. గో పూజా చేశారు పవన్. ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.