Rana Daggubati BirthDay : బర్త్ డే స్పెషల్.. ఆకట్టుకుంటున్న రానా నయా మూవీ టైటిల్ పోస్టర్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రానా. ఆతర్వాత వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు రానా. హీరోగానే కాదు విలన్ గాను నటించి మెప్పించారు రానా. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో బల్లల దేవుడిగా అద్భుతంగా నటించాడు రానా. బాహుబలి సినిమాతో ,మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా.

Rana Daggubati BirthDay : బర్త్ డే స్పెషల్.. ఆకట్టుకుంటున్న రానా నయా మూవీ టైటిల్ పోస్టర్
Rana

Updated on: Dec 14, 2023 | 11:53 AM

దగ్గుబాటి యంగ్ హీరో రానా పుట్టిన రోజు నేడు. ఈ యంగ్ హీరో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు రానా. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు రానా. ఆతర్వాత వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నాడు రానా. హీరోగానే కాదు విలన్ గాను నటించి మెప్పించారు రానా. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాలో బల్లల దేవుడిగా అద్భుతంగా నటించాడు రానా. బాహుబలి సినిమాతో ,మంచి గుర్తింపు తెచ్చుకున్నారు రానా. అలాగే సోలో హీరోగానూ సినిమాలు చేసి మెప్పించారు. తమిళ్, హిందీ సినిమాల్లోనూ కనిపించాడు రానా. రానా తేజ దర్శకత్వంలో వచ్చిన నేనే రాజు నేనే మంత్రి సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరోసారి తేజ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు రానా.

తేజ చాలా కాలం గ్యాప్ తర్వాత తెరకెక్కించిన నేనే రాజు నేనే మంత్రి సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఓ సినిమా రానుంది. ఈ సినిమాకు రాక్షస రాజా అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమా గురించి ఎప్పటి నుంచ్చో వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి.

తాజాగా రానా పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. పెద్ద మెషిన్ గన్ తో అడ్డ నామాలు పెట్టుకొని రానా అగ్రెసివ్ గా కనిపిస్తున్నాడు ఈ పోస్టర్ లో. ఇక ఈ సినిమాలో రానా గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది. రాక్షస రాజా సినిమా టైటిల్ కు తగ్గట్టుగానే సినిమాలో రానా పాత్ర కూడా ఉంటుందని తెలుస్తోంది. రానా ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ సినిమాలో నటిస్తున్నాడు. రజినీకాంత్ టి జే జ్ఞానవేల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న వేటయన్ అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు రానా.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..