ఇటీవల టాలీవుడ్‌లో రచ్చ జరుగుతోన్న విషయం తెలిసిందే. సినిమా నిర్మాణ ఖర్చు పెరిగిపోయిందంటూ ప్రొడ్యూసర్ గిల్డ్ ఇటీవల సంచలన నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. నిర్మాణ ఖర్చు పెరుగుతున్న నేపథ్యంలో షూటింగ్స్ ను ఆపేయాలంటూ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆగస్టు నెలలో షూటింగ్ జరుపుకుంటున్న సినిమాలనీ పెద్ద సినిమాలే.. బడా సినిమాలన్నీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. దాంతో స్టార్ హీరోల ఫ్యాన్స్ లో చిన్న పాటి ఆందోళన మొదలైంది. తమ అభిమాన హీరోల సినిమాలు ఆలస్యం అవుతాయని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. ఇప్పటికే కరోనా పుణ్యమా అని ఎప్పుడో రావాల్సిన సినిజమ ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. మళ్లీ ఇప్పుడు షూటింగ్స్ బంద్ అంటున్నారని ప్రేక్షకులు నిరాశ పడుతున్నారు. అయితే ఇటీవలే స్టార్ హీరోలు అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్ తమ రెమ్యునరేషన్ తగ్గించుకోవడానికి అంగీకరించారని వార్తలు వచ్చాయి ఈ మేరకు ప్రొడ్యూసర్ దిల్ రాజు హీరోలతో సంప్రదింపులు జరిపారని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే తాజాగా ఈ విషయం పై స్పందించారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. రీసెంట్ గా జరిగిన కళ్యాణ్ రామ్ బింబిసార ప్రీరిలీజ్ ఈవెంట్ లో తారక్ మాట్లాడుతూ.. తెలుగు ఇండస్ట్రీ గడ్డుపరిస్థితుల్లో లేదు.. కాకపోతే మంచి సినిమాలు వస్తే ప్రేక్షకులు ఆదరిస్తారంటూ జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ ఆసక్తిని కలిసాగిస్తున్నాయి. ఇండస్ట్రీకి గడ్డు కాలం అంటున్నారు.. ప్రేక్షకులు థియేటర్స్‌కు రావడం లేదు అంటున్నారు..కానీ నేను నమ్మను.. అద్భుతమైన సినిమాలు వస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు అని తారక్ అన్నారు. మరి తారక్ చెప్పినట్టుగా ప్రేక్షకులు రాబోతున్న సినిమాలను ఆదరించి కొత్త ఊపిరిని పోస్తారేమో చూడాలి.