యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమాను పూర్తి చేసే పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు. దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో కొమురం భీమ్ గా కనిపించనున్నాడు తారక్. కరోనా కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే రీస్టార్ట్ అయ్యి టాప్ గేర్ లో దూసుకుపోతుంది. ఈ సినిమాలో తారక్ తోపాటు రామ్ చరణ్ కూడా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు వచ్చేసింది. మరి కొన్ని రోజుల్లో షూటింగ్ పూర్తి చేసి గుమ్మడికాయ కొట్టేయనున్నారు ఆర్ఆర్ఆర్ టీం. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ సినిమా షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నాడు. తారక్ కోసం అదిరిపోయే కథను సిద్దం చేశాడట కొరటాల. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే.. దాంతో ఈ రాబోయే కొరటాల- తారక్ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
సినిమాలతోపాటు టీవీ షో లతోనూ ప్రేక్షకులను అలరించడానికి సిద్దం అవుతున్నాడు యంగ్ టైగర్. ఇప్పటికే స్టార్ మా లో టెలికాస్ట్ అయిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 1 కు తారక్ హోస్ట్ గా వ్యవహరించి ఆకట్టుకున్న విషయం తెలిసిందే. తనదైన ఎనర్జీ తో ఎన్టీఆర్ బిగ్ బాస్ ను టాప్ రేటింగ్ షో గా మార్చేశారు. ఇప్పుడు మరోసార్ బుల్లితెర పై సందడి చేయడానికి సిద్దం అవుతున్నారు తారక్.. ‘ఆట నాది గెలుపు మీది’ అంటూ నయా షో తో రాబోతున్నాడు. ప్రముఖ టీవీ ఛానల్ జెమిని లో టెలికాస్ట్ కానున్న ఎవరు మీలో కోటీశ్వరుడు షోకు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించనున్నారు. RRR సినిమా టాకీ షూటింగ్ పూర్తి చేసుకున్న ఎన్టీఆర్ రేపటి నుండి( జులై 10) ఎవరు మీలో కోటీశ్వరుడు ప్రోగ్రాం షూటింగ్ లో పాల్గొంటున్నారు. వారం రోజుల పాటు ఈ షోకు సంబంధించిన షూటింగులో పాల్గొని జులై 20 నుండి తిరిగి ఆర్ఆర్ఆర్ సినిమా పాట చిత్రీకరణలో పాల్గొంటారు తారక్. ఇలా ఓ వైపు సినిమాలతో మరోవైపు టీవీ షో తో ప్రేక్షకులను అలరించడానికి యంగ్ టైగర్ సిద్దం అవుతున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :