War 2 Box Office Collection Day 2: బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తున్న వార్ 2..! రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే

స్పై యూనివర్శ్‌ మీద ఎప్పుడూ స్పెషల్‌ అటెన్షన్‌ ఉంటుంది. దేశం కోసం పోరాడేవాళ్లు ఎంతకి తెగిస్తారు అంటే ఎంతకైనా తెగిస్తారు. ప్రేమ, పెళ్లి, ఫ్యామిలీ, పరిసరాలూ ఏవీ పట్టవు. వాళ్ల ఊపిరి దేశం. ఆ దేశానికి ఎవరైనా హాని తలపెడితే.. ఆ దేశ భద్రతలో ప్రాణం పోతే.. దేనికైనా సిద్ధమే. నిజ జీవితంలో అలాంటి రా ఏజెంట్స్ ఉండటం వల్లే మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నామనే స్పృహ చాలా మందికి ఉంది. అందుకే స్పై యూనివర్శ్‌ అంటే ఎప్పటికీ స్పెషలే. ఆ నాడి పట్టుకున్న యష్‌ రాజ్‌ ఫిల్మ్స్ తెరకెక్కించిన లేటెస్ట్ చాప్టర్‌ వార్‌2. మన వరకూ అంతేనా.. అంటే! అంతకు మించి.. ఫస్ట్ టైమ్‌ మన హీరో తారక్‌ ఇన్వాల్వ్ అయిన సినిమా. హృతిక్‌ తెలుగుకు పరిచయమవుతున్న సినిమా. అందుకే వార్‌2 మీద ప్రీ రిలీజ్‌ నుంచీ అంత బజ్‌.. అంత క్రేజ్‌.

War 2 Box Office Collection Day 2: బాక్సాఫీస్ దగ్గర కుమ్మేస్తున్న వార్ 2..! రెండో రోజు ఎంత వసూల్ చేసిందంటే
War 2

Updated on: Aug 16, 2025 | 11:08 AM

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కలిసి నటించిన సినిమా వార్ 2. బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఎన్టీఆర్ నటించిన మొదటి బాలీవుడ్ సినిమా కావడంతో రిలీజ్ కు ముందు ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా విడుదల తర్వాత కూడా సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా తొలి రోజే రికార్డ్ స్థాయిలో కలెక్షన్ రాబట్టింది. మొదటి రోజు కంటే రెండో రోజు వార్ 2 కలెక్షన్స్ పెరిగాయి. తొలి రోజు వార్ 2 సినిమా రూ. 52కోట్లు వసూల్ చేసింది. కూలీతో పోటీగా రిలీజైనప్పటికీ వార్ 2 సినిమాకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.

Chiranjeevi: అన్నయ్య నాకు దేవుడు.. లక్షరూపాయిల కోసం ఫోన్ చేస్తే కోటి ఇచ్చారు..

వరుసగా సెలవలు రావడం థియేటర్స్ కు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే సినిమాల కలెక్షన్స్ కూడా పెరుగుతున్నాయి. కాగా రెండో రోజు వార్ 2 సినిమాకు రూ. 56.35 కోట్లు వసూల్ చేసింది. ఇలా రెండు రోజులకు కలిసి వార్ 2 సినిమా రూ. 100కోట్లకు పైగా రాబట్టింది. మొత్తంగా వార్ 2 సినిమాకు రూ. 108.35 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టింది. కాగా వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయిన వార్ 2 సినిమాకు ప్రేక్షకులు బ్రహ్మరధం పడుతున్నారు.

ఇవి కూడా చదవండి

11ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇస్తున్న హీరోయిన్.. అప్పుడు కుర్రాళ్ళ డ్రీమ్ గర్ల్ ఇప్పుడు ఎలా ఉందంటే..

ఎన్టీఆర్ అండ్ హృతిక్.. ఈ సినిమాకు ది బెస్ట్ లుక్ ఇచ్చారు. యాక్షన్లో అయితే నువ్వా నేనా.. అన్నట్టు ఢీకొన్నారు. ఈ యాక్షన్ సీన్స్‌ను కూడా డైరెక్టర్‌ హాలీవుడ్‌ రేంజ్‌లో తెరకెక్కించారు. సినిమాలోని యాక్షన్ ఎపిసోడ్స్‌ చాలు.. సినిమా హండ్రెడ్ పర్సెంట్ వర్త్‌ అని అనిపించడానికి. స్పెషల్లీ విక్రమ్‌ వర్సెస్ కబీర్.. వీళ్లద్దరూ ఎదురుపడి పోట్లాడుకునే ఎపిసోడ్‌ థ్రిల్లింగ్‌గా ఉందని అంటున్నారు సినిమా చూసిన ఫ్యాన్స్. రానున్న రోజుల్లో వార్ 2 కలెక్షన్స్ మరింత పెరగనున్నాయి.

చూస్తే దిమాక్ ఖరాబ్ అవ్వాల్సిందే..! వర్షాకాలంలో వేడిపుట్టిస్తున్న సినిమా.. ఒంటరిగా మాత్రమే చూడండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.