NTR, Hrithik Roshan: తారక్, హృతిక్ భారీ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వార్ 2 వచ్చేది ఎప్పుడంటే..

|

Nov 29, 2023 | 3:00 PM

మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. దాంతో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు.

NTR, Hrithik Roshan: తారక్, హృతిక్ భారీ మల్టీస్టారర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. వార్ 2 వచ్చేది ఎప్పుడంటే..
Ntr, Hrithik Roshan
Follow us on

ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీకి ఎలాంటి బ్యారికేడ్ లేవు . స్టార్ హీరోల సినిమాలతో పాటు చిన్న హీరోల సినిమాలు కూడా పాన్ ఇండియా మూవీలుగా రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఇతర బాషల దర్శకులు, హీరోలు, హీరోయిన్స్ మనదగ్గర.. మనవాళ్లు ఇతర భాషల్లో సినిమాలు చేయడం జరిగుతోంది. ఈ క్రమంలోనే మన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ లో తన సత్తా చాటడానికి రెడీ అయిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ లో ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ రేంజ్ భారీగా పెరిగిపోయింది. దాంతో ఎన్టీఆర్ తో సినిమా చేయడానికి దర్శకులు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు.

బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి ఎన్టీఆర్ సినిమా చేస్తున్నారు. హృతిక్ గతంలో నటించిన వార్ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. తారక్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. దేవర అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా రెండు భాగాలుగా రానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ వార్ సినిమా షూటింగ్ లో పాల్గొనే ఛాన్స్ ఉందని అంటున్నారు.

బ్రహ్మాస్త్ర ఫేమ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే వార్ 2 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తోంది. వార్ 2 సినిమాను 2025లో రిలీజ్ చేయనున్నారు. ఈ భారీ మల్టీస్టారర్ మూవీని ఇండిపెండ్స్ డే సందర్భంగా ఆగష్టు 14 న 2025లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభంకానుంది.

ఎన్టీఆర్ ట్విట్టర్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.