“కులం కారణంగా సొంత గ్రామస్థులే నాపై వివక్ష చూపిస్తున్నారు”

|

Oct 09, 2020 | 6:30 PM

కుల వ్యవస్థ గ్రామాల్లో లోతుగా కూరుకుపోయిందని, సినిమాల్లో ప్రాముఖ్యత పొందిన తాను కూడా వివక్ష నుంచి తప్పించుకోలేకపోకపోయానని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ చెప్పాడు.

కులం కారణంగా సొంత గ్రామస్థులే నాపై వివక్ష చూపిస్తున్నారు
Follow us on

కుల వ్యవస్థ గ్రామాల్లో లోతుగా కూరుకుపోయిందని, సినిమాల్లో ప్రాముఖ్యత పొందిన తాను కూడా వివక్ష నుంచి తప్పించుకోలేకపోకపోయానని ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ చెప్పాడు. ఇప్పటికీ సొంత గ్రామంలో తనను కొందరు అంగీకరించరించడం లేదన్నాడు. కొన్ని గ్రామాలు కుల జాడ్యంతో నిండిపోయాయని పేర్కొన్నాడు. హత్రాస్ ఘటనను చాలా దురదృష్టకరంగా అభివర్ణించిన నవాజుద్దీన్‌కి నెటిజన్ల నుంచి ప్రశంసలు లభించాయి. 

‘ఇప్పటికీ సొసైటీలో కులం వివక్షత అలాగే ఉంది. నా కుటుంబంలో మా నానమ్మది తక్కువ కులం‌‌. దీంతో ఇవాల్టికి కూడా మా గ్రామస్థులు మమ్మల్ని ఒప్పుకోవడం లేదు. నేను ఎంత ప్రాముఖ్యత సంపాదించాను అనేది వాళ్లకు అనవసరం. కులం వారిలో అంత లోతుగా ఇమిడిపోయింది. అది వారి నరనరాలకు వ్యాపించింది. దాన్ని వాళ్లు గౌరవంగా భావిస్తారు’ అని నవాజుద్దీన్ పేర్కొన్నాడు. ఇటీవల సీరియస్ మ్యాన్ అనే నెట్‌‌ఫ్లిక్స్ ఫిల్మ్‌‌లో నవాజుద్దీన్ నటించాడు. ఈ మూవీలో తన తనయుడు సైన్స్ జీనియస్ అని అబద్ధం చెప్పే దళిత తండ్రి పాత్రలో నవాజుద్దీన్ అద్భుతంగా నటించి ప్రేక్షకుల్ని అలరించాడు.

Also Read :

రైతులకు జగన్ సర్కార్ మరిన్ని వరాలు, ఉచితంగానే మోటార్లు, పంపు సెట్లు

ఏపీలో కోవిడ్ నిబంధనల్ని పటిష్టంగా అమలు చేసేందుకు ఉత్తర్వులు జారీ