Tollywood : జిమ్ లేదు.. డైట్ లేదు.. 58 ఏళ్ల వయసులోనూ కుర్రాడిలా స్టార్ హీరో.. రోజూ ఆ ఒక్క పని చేస్తే చాలు..
ప్రస్తుతం సీనియర్ హీరోలు కుర్ర నటులకు గట్టిపోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఓవైపు వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. మరోవైపు ఫిట్నెస్, లుక్స్ విషయంలోనూ తగ్దేదేలే అంటున్నారు. అయితే యాక్టర్స్ ఫిట్ గా ఉండేందుకు రోజూ గంటలు గంటలు జిమ్, వర్కవుట్స్ చేయడం.. డైట్ పాటించడం చేస్తుంటారు. కానీ ఒక హీరో మాత్రం తనకు జిమ్ అస్సలు ఇష్టం లేదని అంటున్నారు. ఇంతకీ అతడు అంత ఫిట్‌గా ఎలా ఉంటారు? ఇక్కడ తెలుసుకోండి!

ప్రస్తుతం చాలా మంది స్టార్స్ తమ ఫిట్నెస్ పై ఎక్కువ దృష్టి పెడుతున్న సంగతి తెలిసిందే. శరీరాకృతిని కాపాడుకోవడానికి రోజూ గంటలు గంటలు కఠినమైన వర్కవుట్స్ చేస్తుంటారు. ఇప్పుడున్న స్టార్ హీరోహీరోయిన్స్ అందరూ తాము వర్కవుట్స్ చేస్తున్న ఫోటోస్, వీడియోస్ సోషల్ మీడియాలో పంచుకుంటారు. కానీ ఒక సీనియర్ హీరో మాత్రం జిమ్ కు వెళ్లకుండా.. ఎలాంటి వర్కవుట్స్ చేయకుండా, డైట్ ఫాలో కాకుండా 58 ఏళ్ల వయసులోనూ పాతికేళ్ల కుర్రాడిలా ఫిట్ గా ఉంటున్నారు. ఆయన మరెవరో కాదు.. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. తాను జిమ్ ప్రేమికుడిని కానని అన్నారు. తన ఫిట్నెస్ గురించి అక్షయ్ కుమార్ మాట్లాడుతూ.. “సాధారణంగా నేను షూటింగ్ కోసం ప్రయాణించినప్పుడు, నాకు వేరే మార్గం లేని పరిస్థితి వస్తుంది. అప్పుడు నేను వెళ్లక తప్పదు. అలాంటి పరిస్థితి తప్ప, నేను ఇతర సందర్భాల్లో జిమ్‌కు వెళ్లను…” అని అన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Vikram Chiyaan : ఆ హీరోయిన్ దేవత.. చాలా మిస్ అవుతున్నాను.. హీరో విక్రమ్ కామెంట్స్..
నిజానికి అక్షయ్ కుమార్ మార్షల్ ఆర్ట్స్ లో నిపుణుడు. ఆయన ఫంక్షనల్ ట్రైనింగ్ చేస్తారు. అందుకు జిమ్ అవసరం లేదు. అలాగే డైట్స్, వర్కవుట్స్ కూడా అక్కర్లేదు. అక్షయ్ కుమార్ ఆరోగ్యకరమైన ఆహారానికి, అలాగే ఉదయాన్నే త్వరగా నిద్రలేచి త్వరగా నిద్రపోయే అలవాటుకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అక్షయ్ కుమార్ తాను ఆరోగ్యంగా ఉండటానికి 7-8 గంటల నిద్రే కారణమని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. దీంతో తాను రోజంతా యాక్టివ్ గా ఉంటానని అన్నారు. రోజంతా ఎక్కువ సమయం దోరుకుతుందని.. సాధారణంగా రాత్రి 9 నుండి 9:30 గంటల మధ్య నిద్రపోయి, ఉదయం 4 గంటలకు నిద్రలేచే అక్షయ్ కుమార్, తన పనులలో చాలా వరకు ఉదయాన్నే పూర్తి చేసుకుంటానని అన్నారు. ఈ కారణంగానే తాను రోజంతా శక్తివంతంగా, ప్రశాంతంగా ఉంటానని ఆయన చెబుతారు.
రోజులోని 24 గంటలను 8 – 8 – 8 గంటలుగా విభజించుకోవాలని చెప్పే అక్షయ్ కుమార్ ఇలా అన్నారు. “దీనిలో నేను మొదటి 8 గంటలను నా షూటింగ్ పని కోసం 100% అంకితభావంతో గడుపుతాను. తర్వాతి 8 గంటలను నా కుటుంబంతో సమయం గడపడం, వ్యాయామం చేయడం, వినోదం వంటి నా వ్యక్తిగత విషయాల కోసం ఉపయోగిస్తాను. చివరి 8 గంటలను నిద్ర కోసం కేటాయిస్తాను. ఈ ఎనిమిదికి ఎనిమిది విభజనలో జీవించడం నా శరీరానికి, మనసుకు ఆరోగ్యాన్ని ఇస్తుంది.” అని చెప్పుకొచ్చారు. అలాగే రోజూ తాను మార్షల్ ఆర్ట్స్ శిక్షణ, ఫంక్షనల్ ట్రైనింగ్, యోగా, ఈత, రన్నింగ్ చేస్తారు. కానీ వీటన్నింటిని ఆయన ఉదయం మాత్రమే చేస్తారు. దీంతో ఆయన ఇంత ఫిట్ గా కనిపిస్తుంటారు. అందుకే అక్షయ్ కుమార్ ఎప్పుడూ జిమ్ వర్కవుట్స్ చేయనని చెబుతుంటారు.
ఇక అక్షయ్ కుమార్ ఆహారం విషయానికి వస్తే.. వారానికి ఒకరోజు ఎలాంటి ఆహరం తీసుకోడట. ఇది తన కడుపును శుభ్రపరచడానికి సహయపడుతుందని అన్నారు. 53 ఏళ్ల వయసులో తాను శాకాహారానికి మారానని చెప్పే అక్షయ్ కుమార్, తన ఆహారంలో ప్రధానంగా పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు ఉండేలా చూసుకుంటారు. ఆయన తన శాకాహారంలో ప్రోటీన్‌పై కూడా దృష్టి పెడతారు శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడానికి, శరీరం నుండి విషపదార్థాలను బయటకు పంపడానికి చాలా నీరు తాగుతానని చెబుతారు. ఎక్కువ ప్రోటీన్ తినడం , ఎక్కువగా నీరు త్రాగడం శరీరానికి బలాన్ని ఇచ్చి, విషపదార్థాలను తొలగిస్తుంది.అలాగే తాను సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఎలాంటి ఆహరం తీసుకోరట. అతను సాయంత్రం 6:30 గంటలకల్లా తన రాత్రి భోజనం ముగించి, అది జీర్ణం కావడానికి 8 గంటల కంటే ఎక్కువ సమయం తీసుకుంటారు. . ఇది అతని శరీర జీవక్రియను పెంచి, శక్తి స్థాయిలను మెరుగుపరుస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Singer S Janaki : పుట్టింది రేపల్లే పల్లపట్లలో.. పెరిగింది కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో.. జానకమ్మ ప్రస్థానం ఇదే..
అక్షయ్ కుమార్..

Akshay Kumar
ఎక్కువ మంది చదివినవి : OTT Cinema : అడవిలో అమ్మాయి మరణం.. ఓటీటీని అల్లాడిస్తున్న థ్రిల్లర్ సినిమా.. తెలుగులోనూ చూడొచ్చు..
