విడుదలకు సిద్దమవుతున్న నితిన్ చెక్ మూవీ… సినిమా నైజాం హక్కులను దక్కించుకుంది ఎవరో తెలుసా..?

ప్రస్తుతం యంగ్ హీరో ‘రంగ్‌ దే’, ‘చెక్‌’, అంధాధున్‌ రీమెక్‌ ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే వాటిలో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న

  • Rajeev Rayala
  • Publish Date - 2:15 am, Fri, 12 February 21
విడుదలకు సిద్దమవుతున్న నితిన్ చెక్ మూవీ... సినిమా నైజాం హక్కులను దక్కించుకుంది ఎవరో తెలుసా..?
రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్‌ పతాకంపై వి. ఆనంద్ ప్రసాద్ నిర్మించారు.

Check movie : ప్రస్తుతం యంగ్ హీరో ‘రంగ్‌ దే’, ‘చెక్‌’, అంధాధున్‌ రీమెక్‌ ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే వాటిలో మొదటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ చేస్తున్న ‘రంగ్ దే’ విడుదలవుతుందని ఆ తరవాతే ‘చెక్’ వస్తుందని అందరూ భావించారు. కానీ ప్లాన్ రివర్స్ అయింది. రంగ్‌ దే( మార్చి 26న విడుదల) కంటే ముందే చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం వహించిన ‘చెక్‌’ సినిమా విడుదల కానుంది. ఫిబ్రవరి 26న చెక్ మూవీ విడుదల కాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ బిజినెస్ పనులు జరుగుతున్నాయి.

ఫస్ట్ నుండి డిఫరెంట్ సినిమాలతో అలరిస్తున్న డైరెక్టర్ చంద్రశేఖర్ ఏలేటి ఈసారి కూడా చెక్ మూవీతో వెరైటీ కాన్సెప్ట్ ఏదో తెరమీదకి తెస్తున్నట్లు తాజాగా విడుదల చేసిన చెక్ ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ఈ సినిమా మంచి బిజినెస్ చేస్తుంది. తాజాగా ఈ సినిమా నైజాం హక్కులను వరంగల్ శ్రీను దక్కించుకున్నారు.  5.40 కోట్లకు చెక్ హక్కులను దక్కించుకున్నారు. ఆంధ్ర ఏరియా 7 కోట్ల రేషియోలో క్లోజ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సీడెడ్ హక్కులను కెఎఫ్ సి సంస్థ సొంతం చేసుకుంది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫోటో.. ఒకే ఫ్రేమ్ లో ఇద్దరు మలయాళ స్టార్లు.. సోషల్ మీడియాలో వైరల్