Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం నుంచి ఫస్ట్ సాంగ్.. మరోసారి అదరగొట్టిన నితిన్

కుర్ర హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం మాచర్ల నియోజక వర్గం.. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు నితిన్.

Macherla Niyojakavargam: మాచర్ల నియోజకవర్గం నుంచి ఫస్ట్ సాంగ్.. మరోసారి అదరగొట్టిన నితిన్
Nithin

Updated on: Jun 01, 2022 | 6:50 AM

కుర్ర హీరో నితిన్(Nithin)నటిస్తున్న తాజా చిత్రం మాచర్ల నియోజక వర్గం(Macherla Niyojakavargam).. చాలా కాలంగా సరైన హిట్ లేక సతమతం అవుతున్నాడు నితిన్. వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ సినిమా తర్వాత ఆ రేంజ్ హిట్ అందుకోలేక పోయాడు నితిన్, చెక్, మాస్ట్రో సినిమాలు నితిన్ అభిమానులను నిరాశపరిచాయి. రంగ్ దే సినిమా పర్లేదు అనిపించినా ఫ్యాన్స్ కు అది సరిపోలేదు.. దాంతో ఇప్పుడు మాచర్ల నియోజక వర్గం పైనే ఆశలు పెట్టుకున్నారు నితిన్ ఫ్యాన్స్. పొలిటికల్ డ్రామ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాకు ఎంఎస్ రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లిమ్ప్స్  ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు.

కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ నిన్న (మంగళవారం) హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి వెంకటేష్ తో పాటు స్పెషల్ గెస్ట్ గా నితిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాచర్ల నియోజక వర్గం మూవీ నుంచి ఓ సూపర్ ఎనర్జిటిక్ సాంగ్ ను రిలీజ్ చేశారు. కృష్ణ చైతన్య ఈ పాటకు సాహిత్యాన్ని అందించారు. ఈ సినిమాకు మహతి స్వరసాగర్ సంగీతాన్ని అందిస్తుండగా.. నితిన్ సొంత బ్యానర్ పై నిర్మిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో విలన్‌గా సముద్రఖని పేరు వినిపిస్తోంది. ఇక ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి