కొన్ని సినిమాలు ఎప్పుడు ఎలా హిట్ అవుతాయో చెప్పలేం.. అలాగే ఎక్కడ హిట్ అవుతాయో కూడా గెస్ చేయలేం. కొన్నిసార్లు. థియేటర్స్ లో ఫ్లాప్ అయిన సినిమాలు టీవీలో మంచి రెంటింగ్ తెచ్చుకొని అక్కడ సూపర్ హిట్ గా నిలుస్తాయి. మరికొన్ని సినిమాలు థియేటర్స్ లో హిట్ అయినా టీవీలో మాత్రం సోసో గానే టీఆర్పీ లు తెచుకుంటాయి. ఇక ఇప్పుడు ఓటీటీల హవా నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొన్ని సినిమాలు థియేటర్స్ లో ఫట్‌మన్నా .. ఓటీటీలో హిట్ అవుతున్నాయి. తాజాగా నితిన్ నటించిన సినిమాకు కూడా అదే పరిస్థితి ఎదురైంది. యంగ్ హీరో నితిన్ నటించిన మాచర్ల నియోజవర్గం సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఎం.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది.
విడుదలకు ముందు ఈ సినిమా టీజర్, ట్రైలర్ భారీ అంచనాలు క్రియాట్ చేసింది. దాంతో మాచర్ల నియోజక వర్గం పై భారీ బజ్ క్రియేట్ చేసింది. ఇక భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయింది. ఆగష్టు 12న ఈ సినిమా రిలీజ్ అయ్యింది.ఈ సినిమాలో రారా రెడ్డి అనే పాట బాగా పాపులర్ అయ్యింది.
ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. డిసెంబర్ 9 నుంచి ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే థియటర్స్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఓటీటీలో మాత్రం హిట్ కొట్టింది. ఈ సినిమాకు భారీ వ్యూస్ వస్తున్నాయి. ఈ మూవీ 75 మిలియన్ మినిట్స్ ను రిజిస్టర్ చేసినట్లు జీ5 ప్రకటించింది. అయితే ఈ సినిమా బాగానే ఉందే ఎందుకు డిజాస్టర్ అయ్యిందబ్బా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ సమయంలోనే కార్తికేయ 2 కూడా రిలీజ్ అవ్వడం ఈ మూవీకి మైనస్ అయ్యిందని అంటున్నారు కొందరు.