Nithiin Engagement: టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ పెళ్లికి ముహూర్తం కుదిరింది. కొంతకాలంగా నితిన్ ఓ అమ్మాయితో లవ్‌లో ఉన్నాడని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాడని వార్తలు వచ్చాయి. ఇప్పుడు అవే నిజం అయ్యాయి. 8 ఏళ్లుగా తాను ప్రేమిస్తున్న షాలినితో నేడు(శనివారం) నితిన్ ఎంగేజ్‌మెంట్ జరిగింది. హైదరాబాద్‌లోని తన ఇంట్లోనే ఈ కార్యక్రమం సాంప్రదాయబద్దంగా జరిగింది. ఈ వేడకకు నితిన్ ఫ్యామిలీకి సన్నిహితంగా ఉండే అతికొద్దిమంది వ్యక్తులు మాత్రమే హాజరయ్యారు. దుబాయ్‌లో ఏప్రిల్ 16న ఓ హెటల్‌లో ఈ కపుల్ డెస్టినేషన్ మ్యారేజ్ చేసుకోబోతుంది.
నితిన్ షాలినికి ఎలా ప్రపోజ్ చేశాడంటే :
2012 నుంచి నితిన్, షాలిని ఫ్రెండ్స్ అయ్యారట. ఆ తర్వాత కొద్దికాలానికి వీరిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. దీంతో మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. అయితే షాలినికి ప్రపోజ్ చెయ్యడానికి కాస్త డిఫరెంట్ పద్దతిని ఎన్నుకున్నాడట నితిన్. ఒంటికాలిపై నిల్చుని వెరైటీగా ప్రపోజ్ చేశాడట. నితిన్ వేషాలు చూసి తనలో తాను నవ్వుకున్న షాలిని..వెంటనే అతని ప్రపోజల్‌ను యాక్సెప్ట్ చేసిందట. ఫిబ్రవరి 14 నాడు వాలెంటైన్స్ డే సందర్భంగా తన నెక్ట్స్ మూవీ ‘భీష్మ’ లోని సింగిల్ యాంథెమ్ రిలీజ్ చేసి..ఆ తదుపరి రోజే పెళ్లి ఫిక్స్ చేసుకున్నాడు నితిన్. దీంతో “సింగిల్ అన్నావ్..సింపుల్‌గా నిఖా పక్కా చేసుకున్నావ్” అంటూ సరాదాగా వ్యాఖ్యానిస్తున్నారు నెటిజన్లు.
Ninna, Single single Ani song release chesi eroju pelli panulu start chesava bro pic.twitter.com/nJhAHQN6dJ
— ? గబ్బర్ ? (@jsrkalyan) February 15, 2020
— Hemanth Aadhf (@HemanthCreatio5) February 15, 2020