Spy: నిఖిలయ్యా… కథ మారేనయ్యా !!

హిట్టు.. ఫట్టుతో సంబంధం లేదు! కలెక్షన్స్‌ లెక్కలతో.. కనెక్షన్ లేదు..! రిలీజ్ అవగానే వచ్చే... రివ్యూలతో.. పబ్లిక్ టాక్‌లతో అసలే పనిలేదు..! జెస్ట్ రిలీజ్ అవ్వడేఆలస్యం సినిమా దిమ్మతిరిగే రెస్పాన్స్ తెచ్చుకోవడం ఖాయం! ఎక్కడంటారా! ఓటీటీ ప్లాట్‌ ఫాంలలో..! ఎస్ ! ఓ సినిమా రిజెల్ట్ తో సంబంధం లేకుండా..

Updated on: Jul 28, 2023 | 9:51 AM

హిట్టు.. ఫట్టుతో సంబంధం లేదు! కలెక్షన్స్‌ లెక్కలతో.. కనెక్షన్ లేదు..! రిలీజ్ అవగానే వచ్చే… రివ్యూలతో.. పబ్లిక్ టాక్‌లతో అసలే పనిలేదు..! జెస్ట్ రిలీజ్ అవ్వడేఆలస్యం సినిమా దిమ్మతిరిగే రెస్పాన్స్ తెచ్చుకోవడం ఖాయం! ఎక్కడంటారా! ఓటీటీ ప్లాట్‌ ఫాంలలో..! ఎస్ ! ఓ సినిమా రిజెల్ట్ తో సంబంధం లేకుండా.. ఓటీటీ ప్లాట్‌ ఫాంలలో స్క్రీనింగ్ అవుతున్న సినిమాలు రీసెంట్ డేస్లో దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటున్నాయి. మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చేలా చేసుకుంటున్నాయి. చడీ చప్పుడకు కాకుండా.. అర్థరాత్రుల్లు ఓటీటీలో ప్రత్యక్షమవుతూనే.. ఆడియెన్స్ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇక తాజాగా నిఖిల్ స్పై సినిమా కూడా ఇదే చేసింది. అమెజాన్ ప్రైమ్‌ లో రిలీజ్ అయిపోయి.. థియేటర్ మించి రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటోంది.

నిజానికి పాన్ ఇండియన్ స్పాన్‌ లో రిలీజ్ అయిన నిఖిల్ స్పై మూవీ.. డిజాస్టర్ టాక్‌ను తెచ్చుకుంది. కలక్షన్స్ కొంత వరకు బానే రాబట్టినా.. ఫైనల్‌గా.. బాక్సాఫీస్ ముందు చతికిలపడిపోయింది. ఇక ఈక్రమంలోనే ఎలాంటి బజ్ లేకుండా ప్రైమ్ ఓ ప్రత్యక్షమైన ఈ మూవీ.. ఇప్పుడు చాలా మందిని చూసేలా చేసుకుంటోంది. అసలు సినిమా ఎందుకు పోయిందని తెలుసుకోవాలనే ఆత్రమో .. లేక నిఖిల్ మీద ఉన్న అభిమానమో.. తెలీదు కానీ..ఈ సినిమా ఓటీటీలో అయితే హిట్ రెస్పాన్స్‌ను తెచ్చేలా చేసుకుంటోంది. నిఖిలయ్యా.. స్పై కథ మారేనయ్యా.. ఓటీటీలో హిట్ అయ్యా అనే కామెంట్ .. ఆయన ఫ్యాన్స్‌ నుంచి ఫన్నీగా వస్తోంది.