18 Pages: శరవేగంగా నిఖిల్ , అనుపమ మూవీ షూటింగ్.. చివరి దశలో 18 పేజీస్ సినిమా

ఇక ఈ మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు కార్తికేయ 2 టీమ్. ఇక ఇప్పుడు నిఖిల్, అనుపమ మరోసారి 18 పేజీస్ సినిమాకి జతకట్టారు.

18 Pages: శరవేగంగా నిఖిల్ , అనుపమ మూవీ షూటింగ్.. చివరి దశలో 18 పేజీస్ సినిమా
18 Pages

Updated on: Oct 27, 2022 | 9:33 AM

ఇటీవలే కార్తికేయ-2 సినిమాతో హిట్ అందుకున్నడు యంగ్ హీరో  నిఖిల్ సిద్ధార్థ. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటించింది. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇక ఈ మూవీతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు కార్తికేయ 2 టీమ్. ఇక ఇప్పుడు నిఖిల్, అనుపమ మరోసారి 18 పేజీస్ సినిమాకి జతకట్టారు. ఈ నాస్టాల్జిక్ రొమాన్స్‌ని పుష్ప దర్శకుడు సుకుమార్ రాశారు. ఇదే కాకుండా గతంలో కుమారి 21 ఎఫ్ చిత్రానికి కూడా కథను అందించారు. అతని శిష్యుడు పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వం వహించారు. ఈ 18 పేజిస్ సినిమాను సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి GA2 పిక్చర్స్‌పై బన్నీ వాస్ నిర్మించారు.

ప్రస్తుతం ఈ సినిమా తుది దశకు చేరుకుంది. కొంచెం విరామం తర్వాత, నిఖిల్ 18 పేజీస్ సెట్‌కి తిరిగి వచ్చారు. ఇక  18 పేజీస్ చివరి షెడ్యూల్ ఇటీవల ప్రారంభమైంది, చిత్రీకరణ కూడా అద్భుతంగా కొనసాగుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను డిసెంబర్ 23న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

సినిమాటోగ్రాఫర్ ఎ వసంత్ విజువల్స్ సినిమా ఫీల్ గుడ్ వైబ్‌ని పెంచాయి. 18 పేజీస్ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ వర్క్ చేస్తున్నారు. ప్రముఖ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమానుంచి అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు చిత్రయూనిట్.

ఇవి కూడా చదవండి