Nikhil Siddharth: హీరో నిఖిల్ కొడుకు నామకరణ మహోత్సవం.. బారసాల ఫోటోస్ వైరల్..

|

Mar 17, 2024 | 6:50 AM

కొడుకు పుట్టడంతో నిఖిల్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. ఏడాది క్రితం తండ్రిని కోల్పోయారు నిఖిల్. ఇప్పుడు తన తండ్రే తనకు బిడ్డగా పుట్టాడని మురిసిపోయాడు. తన కొడుకును చూస్తూ ఎమోషనల్ అయ్యారు. తన సంతోషాన్ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ఇప్పుడు శనివారం నిఖిల్ కొడుకు నామకరణ మహోత్సవ వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది.

Nikhil Siddharth: హీరో నిఖిల్ కొడుకు నామకరణ మహోత్సవం.. బారసాల ఫోటోస్ వైరల్..
Nikhil
Follow us on

టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇటీవలే తండ్రిగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. గతనెల ఫిబ్రవరి 21న ఆయన భార్య పల్లవి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొడుకు పుట్టడంతో నిఖిల్ సంతోషానికి అవధులు లేవనే చెప్పాలి. ఏడాది క్రితం తండ్రిని కోల్పోయారు నిఖిల్. ఇప్పుడు తన తండ్రే తనకు బిడ్డగా పుట్టాడని మురిసిపోయాడు. తన కొడుకును చూస్తూ ఎమోషనల్ అయ్యారు. తన సంతోషాన్ని అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ఇక ఇప్పుడు శనివారం నిఖిల్ కొడుకు నామకరణ మహోత్సవ వేడుక ఘనంగా జరిగినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. దీంతో నిఖిల్ దంపతులకు శుభాకాంక్షలు చెబుతూనే కొడుకు పేరెంటీ ?.. ఏ పేరు పెట్టారు ? అంటూ ప్రశ్నల వర్షం కురిపస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం నిఖిల్ కొడుకు బారసాల ఫోటోస్ ట్రెండ్ అవుతున్నాయి.

నిఖిల్, పల్లవి 2020లో సింపుల్ గా వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లపాటు ప్రేమలో ఉన్న వీరు ఇరు కుటుంబసభ్యుల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. కరోనా లాక్ డౌన్ సమయం కావడంతో ఎలాంటి హడావిడి లేకుండా సింపుల్ గా వివాహం చేసుకున్నారు. ఇక నిఖిల్ సినిమాల విషయానికి వస్తే కార్తికేయ 2 సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. డైరెక్టర్ చందూ మొండేటీ తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయ్యింది. దీంతో అటు నార్త్ ఇండస్ట్రీలోనూ ఈ యంగ్ హీరోకు మంచి క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే 18 పేజీలు సినిమాతో మరోసారి విజయాన్ని అందుకున్నారు.

దీంతో ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాలపై ఫోకస్ పెట్టాడు.తన తదుపరి ప్రాజెక్ట్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం స్వయంభూ చిత్రంలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ సినిమాపై మరింత ఆసక్తిని క్రియేట్ చేశాయి. ఈ సినిమా కోసం నిఖిల్ తన లుక్ పూర్తిగా మార్చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.