ప్రారంభమైన ’18 పేజెస్‌’ షూటింగ్

యంగ్ హీరో నిఖిల్‌, అందాల బొమ్మ అనుపమ పరమేశ్వరన్‌ జంటగా '18 పేజెస్‌' పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. పల్నాటి సూర్య ప్రతాప్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

ప్రారంభమైన '18 పేజెస్‌' షూటింగ్
Follow us
Ram Naramaneni

|

Updated on: Oct 20, 2020 | 6:37 PM

యంగ్ హీరో నిఖిల్‌, అందాల బొమ్మ అనుపమ పరమేశ్వరన్‌ జంటగా ’18 పేజెస్‌’ పేరుతో ఓ మూవీ తెరకెక్కుతోంది. పల్నాటి సూర్య ప్రతాప్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మంగళవారం ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ లొకేషన్‌ స్టిల్‌ విడుదల చేసింది మూవీ యూనిట్. ఇందులో నిఖిల్‌, అనుపమ నవ్వులు చిందిస్తూ అలరించారు. ప్రముఖ దర్శకుడు సుకుమార్‌ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతా ఆర్ట్స్‌ 2 పతాకంపై బన్నీ వాసు నిర్మిస్తున్నారు. గోపీ సుందర్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. కాగా ‘హలో గురు ప్రేమ  కోసమే’ తర్వాత అనుపమ తెలుగులో నటించలేదు. దాదాపు రెండోళ్ల తర్వాత ఆమె తెలుగు సినిమాలో నటించలేదు. నిఖిల్, అనుపమ కూడా గతంలో కలిసి నటించలేదు. దీంతో సినిమాపై చాలా ఫ్రెష్‌గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.