కుర్రహీరో నిఖిల్ కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. సినిమాలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు నిఖిల్. ఈ కుర్ర హీరో ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెట్టి ఆయా షూటింగ్స్ పనిలో బిజీగా ఉన్నాడు. ఇక ఇప్పటికే నిఖిల్ 18 పేజెస్(18 Pages), కార్తికేయ 2 సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల్లో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటిస్తుంది. సుకుమార్రైటింగ్స్ లో నిఖిల్ 18 పేజెస్ అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో నిఖిల్ విభిన్న మైన పాత్రలో కనిపించనున్నాడట. అలాగే చెందు మొండేటి దర్శకత్వంలో కార్తికేయ 2 అనే సినిమా చేస్తున్నాడు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో కార్తికేయ సినిమా వచ్చింది. ఇక ’18 పేజెస్’ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ మరియు సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నారు.
’18 పేజెస్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాలో హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది. తాజాగా ఈ సినిమానుంచి ఓ వీడియో గ్లింప్స్ ని రిలీజ్ చేశారు. నాకు తెలియని ఒక అమ్మాయి ఎప్పుడూ ఒక విషయం చెబుతూ ఉండేది.. ప్రేమించడానికి రీజన్ ఉండకూడదు.. ఎందుకు ప్రేమించామంటే ఆన్సర్ ఉండకూడదు’ అని నిఖిల్ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది. కవితలు రాసే యువతి నందినిగా అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తోంది. అయితే ఆమె కవితలను ఆమెను చూడకుండా హీరో చదువుతూ ఉంటాడని అర్ధమవుతుంది. ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ‘నన్నయ్య రాసిన కావ్యం ఆగితే.. తిక్కన తీర్చేనుగా.. రాధమ్మ ఆపిన పాట మధురిమ కృష్ణుడు పాడెనుగా..’ అంటూ బ్యాగ్రౌండ్ లో వచ్చిన సాంగ్ ఆకట్టుకుంది.
మరిన్ని ఇక్కడ చదవండి :