
అభిమానం హద్దులు దాటితే.. ఫ్యాన్స్‌ను చూస్తేనే భయపడే పరిస్థితి వస్తే.. నిన్న హీరోయిన్ నిధి అగర్వాల్‌కి ఇలాంటి పరిస్థితే ఎదురైంది. ఆ గుంపు నుంచి ఎలాగోలా బయటపడి కారెక్కేవరకూ ఎంత భయపడిందో ఆమె ఫేస్ చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. నిన్న రాజాసాబ్ సినిమాలోని 2వ సాంగ్ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో జరిగింది. సహనా పాటను KPHBలోని ఓ మాల్‌లో రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ కార్యక్రమానికి వచ్చిన హీరోయిన్ నిధి అగర్వాల్‌ను ఫ్యాన్స్ ఉక్కిరిబిక్కిరి చేసేశారు. ఈవెంట్ తర్వాత బయటకు వెళ్లేందుకు అవకాశం ఇవ్వకుండా అంతా ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. కారు దగ్గరకు వెళ్లేందుకు కూడా ఛాన్స్ లేనంతగా తోపులాట మొదలైంది. ఎట్టకేలకు సెక్యూరిటీ సాయంతో అక్కడి నుంచి బయటపడింది నిధి అగర్వాల్. బయటకు వస్తున్నప్పుడు, కార్ ఎక్కిన తర్వాత నిధి ఫేస్ చూస్తే ఎంతగా భయపడిందో.. ఫ్యాన్స్ అతికి ఎంతగా వణికిపోయిందో క్లియర్‌గా కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి : 11 సినిమాలు చేస్తే 10 బ్లాక్ బస్టర్ హిట్లే.. తెలుగులో తోపు హీరోయిన్..సైన్యంలో పనిచేసి ఉరి దాడిలో మరణించిన తండ్రి..
అంతా తోసుకుంటూ మీద పడిపోతుండడంతో జనాల్ని కంట్రోల్ చేయడం, నిధిని బయటకు తీసుకురావడం ఓ మినీ యుద్ధం చేసినట్టుగా ఉంది. సంక్రాంతి కానుకగా వచ్చే నెల 9న ప్రేక్షకుల ముందుకు వస్తోంది రాజాసాబ్.. ప్రభాస్ హీరోగా మారుతీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీకి సంబంధించిన డ్యూయట్‌ని నిన్న రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్ కోసం వచ్చిన నిధి అగర్వాల్‌కి ఫ్యాన్స్ ఇలా నరకం చూపించారు.
ఇవి కూడా చదవండి : Actress : కమిట్‌మెంట్ ఇవ్వలేదని 30 సినిమాల్లో నుంచి తీసేశారు.. హీరోయిన్ సంచలన కామెంట్స్..
చివరగా హరి హర వీరమల్లు సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన నిధి.. ఇప్పుడు రాజాసాబ్ చిత్రంలో నటిస్తుంది. ఈ మూవీలో ప్రభాస్ హీరోగా నటిస్తుండగా.. డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తున్నారు. ఇందులో మాళవిక మోహనన్ , రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఇవి కూడా చదవండి : Megastar Chiranjeevi : చిరంజీవితో మూడు సినిమాల్లో ఛాన్స్.. ఆ కారణంతోనే చేయలేకపోయాను.. హీరోయిన్..