News9 Global Summit: ‘అప్పుడే ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది’.. న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో వివేక్ ఓబెరాయ్

ప్రముఖ బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ టీవీ9 నెట్‌వర్క్ న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్నారు. ఈ ప్రపంచ సైద్ధాంతిక వేదికలో ది సెకండ్ యాక్ట్ అనే అంశంపై ఆయన మాట్లాడారు. భారత్-యుఏఈ ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా గురువారం (జూన్ 19) ఈ సమ్మిట్ ప్రారంభమైంది.

News9 Global Summit: అప్పుడే ఈ ప్రపంచం మిమ్మల్ని గుర్తిస్తుంది.. న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో వివేక్ ఓబెరాయ్
News9 Global Summit, Vivek Oberoi

Updated on: Jun 19, 2025 | 4:47 PM

భారతదేశపు అతిపెద్ద న్యూస్ నెట్‌వర్క్ టీవీ9 అంతర్జాతీయ న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్ గురువారం (జూన్ 19) ప్రారంభమైంది. దుబాయ్ వేదికగా జరుగుతోన్న ఈ సమ్మిట్ లో పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పాల్గొంటున్నారు. ఈ క్రమంలో గత 23 సంవత్సరాలుగా చిత్ర పరిశ్రమలో భాగమైన బాలీవుడ్ ప్రముఖ నటుడు వివేక్ ఒబెరాయ్ ఈ సమ్మిట్‌కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అతను ది సెకండ్ యాక్ట్ అనే అంశంపై ఆసక్తికర ప్రసంగం ఇచ్చాడు. ‘ది సెకండ్ యాక్ట్ అంటే మిమ్మల్ని మీరు తిరిగి నిర్వచించుకోవడం. మీరు విలువలకు కట్టుబడితేనే ప్రపంచం మిమ్మల్ని గౌరవిస్తుంది, విలువైనదిగా భావిస్తుంది. ఇది డబ్బు, గౌరవం లేదా స్థానం విషయంలో ఏదైనా కావొచ్చు. మీరు ప్రస్తుతం ఎక్కడ ఉన్నారో అక్కడితో ప్రయాణం ముగియదు. మీరు చేస్తున్న ప్రయాణం మీ గమ్యస్థానం కాదు. మీ ప్రయాణాన్ని ఎంచుకుని, మీ దిశను తీసుకునే శక్తి మీ అందరికీ ఉంది. కానీ కొన్నిసార్లు మనం నిశ్శబ్ధంలో తప్పిపోతాం. ఆ శబ్దం మనం ఎక్కడ ఉండాలో చెబుతుంది, ఆ శబ్దం మనలోని స్వరాన్ని, మిమ్మల్ని నడిపించే స్వరాన్ని విననివ్వదు. మనం ఎక్కడికైనా చేరుకోవాలనుకుంటే, ఏదైనా సాధించాలనుకుంటే, మన చుట్టూ ఎంత శబ్దం ఉన్నా, మన అంతర్గత స్వరాన్ని వింటూనే ఉండాలి. ధైర్యంగా ముందుకు సాగాలి’ అని వివేక్ తన మాటలతో స్ఫూర్తి నింపేందుకు ప్రయత్నించాడు.

ఈ కార్యక్రమంలో టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈఓ బరుణ్ దాస్ మాట్లాడుతూ దుబాయ్ నగరానికి విజన్ ఇన్ మోషన్ అని ట్యాగ్ ఇచ్చారు. ‘మీరు ఏదైనా చేయాలనుకుంటే అన్నింటిలో ప్రధానంగా ఆలోచించుకోవాల్సింది దార్శనికత. ఆ తర్వాత ఆ దార్శనికతను ముందుకు తీసుకెళ్లడానికి ధైర్యం, నిబద్ధత అవసరం. నేను దుబాయ్‌కి వచ్చినప్పుడల్లా, నాకు ఇది గుర్తుంది. నేను ఈ నగరాన్ని ‘విజన్ ఇన్ మోషన్’ అని పిలుస్తాను’ అని అన్నారు.

ఈసారి దుబాయ్‌లో జరుగుతున్న న్యూస్ 9 గ్లోబల్ సమ్మిట్ యొక్క థీమ్ “భారతదేశం-యుఎఇ: శ్రేయస్సు మరియు పురోగతి కోసం భాగస్వామ్యం”. ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క దృష్టి వేగంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశం మరియు యుఎఇ భాగస్వామ్యం యొక్క ముఖ్య అంశాలపై ఉంటుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.