
టాలీవుడ్ కొత్త జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న హైదరాబాద్ చేరుకున్నారు. ఉదయ్‌పూర్‌లో గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత ఈ కొత్త దంపతులు శుక్రవారం (ఫిబ్రవరి 27) సాయంత్రం హైదరాబాద్ కు చేరుకున్నారు. ఫ్యామిలీతో కలిసి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన ఈ నవ దంపతులకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. కాగా గురువారం (ఫిబ్రవరి 26)న విజయ్- రష్మిక మందన్నాల వివాహం అట్టహాసంగా జరిగింది. రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ ప్యాలెస్ వేదికగా జరిగిన ఈ వివాహ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితులు హాజరయ్యారు. అలాగే పలువరు సినీ ప్రముఖులు హాజరై నూతన దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.
కాగా పెళ్లి తంతు పూర్తయిన తర్వాత స్వయంగా విజయ్- రష్మికలే తమ పెళ్లి వేడుకలను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు. దీంతో ఇప్పటికీ ఈ పెళ్లి ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో తెగ ట్రెండ్ అవుతున్నాయి. కాగా మార్చ్ 04న విజయ్- రష్మికల వెడ్డింగ్ రిసెప్షన్ జరగనుంది. ఇందుకోసం హైదరాబాద్ లోని తాజ్ కృష్ణ హోటల్ ను వేదికగా ఎంచుకున్నారని తెలుస్తోంది. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు విజయ- రష్మికల రిసెప్షన్ కు హాజరుకానున్నారని సమాచారం.
The lovely couple #VijayDeverakonda & #RashmikaMandanna touch down in Hyderabad post-wedding!❣️✨#VIROSH #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/gY55ei8q5s
— Telugu FilmNagar (@telugufilmnagar) February 27, 2026
Rashmika Mandanna and Vijay Deverakonda met Prime Minister Narendra Modi in New Delhi to personally invite him to their wedding celebrations. The couple shared a warm interaction while handing over the invitation and later met Union Home Minister Amit Shah, presenting him with a… pic.twitter.com/hIvQZPUZtY
— E.Bhaskar Rao (@DrEBhaskarrao) February 27, 2026
First appearance after the wedding and the glow says it all ✨❤️#RashmikaMandanna & #VijayDeverakonda stepping out together like a real-life fairytale couple 🥹💍#MissMalini pic.twitter.com/8muqp2DBIU
— MissMalini (@MissMalini) February 27, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.