Adipurush: ఆదిపురుష్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే

ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు.

Adipurush: ఆదిపురుష్ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది.. ఫ్యాన్స్‌కు పండగే
adipurush

Updated on: Mar 30, 2023 | 7:16 AM

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సినిమా కోసం ఆయన అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. రాధేశ్యామ్ సినిమా తర్వాత ప్రభాస్ వరుస సినిమాలను లైనప్ చేసి గ్యాప్ లేకుండా షూటింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ డైరెక్షన్ లో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నాడు. సీత బాలీవుడ్ అందాల భామ కృతిసనన్ నటిస్తోంది. అలాగే రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఈ సినిమానుంచి అప్డేట్స్ కోసం అభిమానులంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇటీవలే శ్రీరామ నవమి నుంచి వరుసగా అప్డేట్స్ ఇస్తామని చెప్పిన మేకర్ తాజాగా ఆదిపురుష్ నుంచి క్రేజీ అప్డేట్ ఇచ్చారు.

ఆదిపురుష్ నుంచి పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సీతారాములుగా ప్రభాస్, కృతి కనిపిస్తుండగా పక్కన లక్ష్మణుడు.. అలాగే ఆంజనేయుడు కూడా ఉన్నారు. శ్రీరామ నవమి సందర్భంగా విడుదలైన ఈ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఈ పోస్టర్ కు మంత్రం కన్నా గొప్పది నీ నామం.. జై శ్రీరామ్ అంటూ రాసుకొచ్చారు. ఇక ఆదిపురుష్ లేటెస్ట్ అప్డేట్ తో సినిమా పై అంచనాలు డబుల్ అయ్యాయి. జూన్ 16న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా సలార్. పాన్ ఇండియా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను కూడా వీలైనంత త్వరగా రిలీజ్ చేయాలనీ సన్నాహాలు చేస్తున్నారు. దాంతో ఆదిపురుష్ కంటే ముందే సాలార్ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తెలుస్తోంది.