OTT Movies: ఈ వారం థియేటర్స్‌లో.. ఓటీటీల్లో ఆకట్టుకోనున్న సినిమాలు, సిరీస్లు ఇవే..

|

Feb 10, 2025 | 2:34 PM

ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు కొత్త సినిమాలు, వెబ్ సిరీస్‌లు స్ట్రీమింగ్ కు రానున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం ఈ వీక్ లో 20కు పైగానే సినిమాలు, వెబ్ సిరీస్ లు రిలీజ్ అవుతున్నాయి. . వాటిలో ఎక్కువగా హిందీ, ఇంగ్లిష్ చిత్రాలే ఉన్నాయి. ఇక ఈవారం ఓటీటీలో ఆకట్టుకోనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే..

OTT Movies: ఈ వారం థియేటర్స్‌లో.. ఓటీటీల్లో ఆకట్టుకోనున్న సినిమాలు, సిరీస్లు ఇవే..
Movies
Follow us on

వారం వారం ఓటీటీలో సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. థియేటర్స్ లో కొత్త సినిమాలు సందడి చేస్తుంటే పదుల సంఖ్యలో సినిమాలు ఓటీటీల్లో రిలీజ్ అవుతున్నాయి. పాన్ ఇండియా సినిమాలు దూసుకుపోతున్న నేపథ్యంలో ఓటీటీల్లోనూ అన్ని బాషల సినిమాలు ఆకట్టుకుంటున్నాయి. ఇక ఈ వారం థియేటర్స్ లో సందడి చేయనున్న సినిమాలు ఇవే .. ఈ వారంలో ప్రేమికుల రోజు ఉండటంతో  కోన్ ని ఇంట్రెస్టింగ్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. వాటిలో ముఖ్యంగా చెప్పాల్సిన సినిమా విశ్వక్ సేన్ లైలా. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఈసారి లైలా సినిమాతో రానున్నారు. ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనున్నారు.

ఈ సినిమాతో పాటు బ్రహ్మానందం ఆయన కుమారుడు గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న బ్రహ్మా ఆనందం సినిమా  కూడా ఈ వారం విడుదల కానుంది. ఈ సినిమా  కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. విక్కీ కౌశల్‌ , రష్మిక నటించిన ఛావా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. ఇక ఓటీటీ సినిమాల విషయానికొస్తే ..

1. ధూమ్‌ ధామ్‌ (హిందీ)  ఫిబ్రవరి 14

2 బ్లాక్‌ హాక్‌ డౌన్‌ (ఇంగ్లీష్‌) ఫిబ్రవరి 10

3. కాదలిక్క నేరమిల్లై (తమిళ్‌) ఫిబ్రవరి 11

సోనీలివ్‌

4. మార్కో (తెలుగు) ఫిబ్రవరి 14

డిస్నీ+హాట్‌స్టార్‌

5. బాబీ రిషి లవ్‌స్టోరీ (హిందీ) ఫిబ్రవరి 11

జీ5

6. ప్యార్‌ టెస్టింగ్‌ (హిందీ) ఫిబ్రవరి 14

అమెజాన్ ప్రైమ్ ఓటీటీ

7. బేబీ జాన్ (హిందీ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 5

8. 54321 (తమిళ సైకలాజికల్ థ్రిల్లర్ చిత్రం)- ఫిబ్రవరి 5

9. ఇన్విసిబుల్ సీజన్ 3 (ఇంగ్లీష్ యానిమేటెడ్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 6

10. గేమ్ ఛేంజర్ (తెలుగు పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ)- ఫిబ్రవరి 7

11. ది మెహాతా బాయ్స్ (హిందీ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7

12. న్యూటోపియా (సౌత్ కొరియన్ హారర్, సర్వైవల్ ఫాంటసీ థ్రిల్లర్ వెబ్ సిరీస్)- ఫిబ్రవరి 7

మనోరమ మ్యాక్స్ ఓటీటీ

13. స్వర్గం (మలయాళ ఫ్యామిలీ డ్రామా చిత్రం)- ఫిబ్రవరి 7

14. ఓషానా (మలయాళ రొమాంటిక్ లవ్ స్టోరీ సినిమా)- ఫిబ్రవరి 7

15. వాలియెట్టన్ 4కె (మలయాళ యాక్షన్ థ్రిల్లర్ సినిమా)- ఫిబ్రవరి 7