ఇక్కడ స్టార్ డమ్ వచ్చిన భామలంతా ఇతరభాషల్లోకి జంప్.. కొత్త అందాల వేటలో టాలీవుడ్ డైరెక్టర్లు..

|

Jun 14, 2021 | 2:14 PM

టాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలోకి కొద్దికొద్దిగా కొత్త నీరు వచ్చి చేరుతోంది. నిన్నమొన్నటి క్వీన్స్ తో మొహం మొత్తిందో ఏమో.. డైరెక్టర్స్ తో పాటు ఆడియెన్స్ కూడా.. వియ్ నీడ్ న్యూ బ్లడ్ అంటున్నారు.

ఇక్కడ స్టార్ డమ్ వచ్చిన భామలంతా ఇతరభాషల్లోకి జంప్..  కొత్త అందాల వేటలో టాలీవుడ్ డైరెక్టర్లు..
Follow us on

టాలీవుడ్ గ్లామర్ ప్రపంచంలోకి కొద్దికొద్దిగా కొత్త నీరు వచ్చి చేరుతోంది. నిన్నమొన్నటి క్వీన్స్ తో మొహం మొత్తిందో ఏమో.. డైరెక్టర్స్ తో పాటు ఆడియెన్స్ కూడా.. వియ్ నీడ్ న్యూ బ్లడ్ అంటున్నారు. దానికి తగ్గట్టే.. నియర్ ఫ్యూచర్లో కొత్త సినిమాల్లో కొత్త కొత్త హీరోయిన్ల పేర్లు వినబోతున్నాం. గాన్ ఈజ్ గాన్.. లెటజ్ సి ఫర్ గోల్డెన్ డేస్ అంటోంది.. మన గ్లామర్ వరల్డ్.
సరిలేరు నీకెవ్వరూ, బీష్మ సినిమాలు సూపర్ హిట్ కావడంతో రష్మిక మందనకు తిరుగులేదన్న పేరొచ్చింది అప్పట్లో. అమ్మాయ్.. ఇక నీకు బెంగళూరు నుంచి షటిల్ సర్వీస్ తప్పదు.. అంటూ టాలీవుడ్ లో ఆమెకు గోల్డెన్ డేస్ ఎహెడ్ అనే రేంజ్ లో చెప్పారు డైరెక్టర్ త్రివిక్రమ్. కానీ.. పుష్ప తప్పితే ఆమె ఖాతాలో బిగ్ ప్రాజెక్టులేవీ పడలేదు. శర్వానంద్ తో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ మూవీ చేస్తున్నారు రష్మిక.

గోపికమ్మ పూజాహెగ్డే సిట్యువేషన్ కూడా దాదాపుగా అంతే. అలవైకుంఠపురములో తర్వాత బుట్టబొమ్మ కిట్టీలో హిందీ సినిమాలు పడినప్పటికీ.. తెలుగులో మాత్రం ఆమె కోసం వెయిట్ చేయడం మానేశారు డైరెక్టర్స్. అంతకుముందే కన్ఫర్మ్ అయిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పాటు ఆచార్యలో ఒక కేమియో మాత్రమే చేస్తున్నారు జిగేల్ రాణి. హరీష్-పవన్ మూవీలో పూజ హెగ్డేను తీసుకున్నారన్న మాటే తప్ప.. ఇంకా కన్ఫర్మేషన్ లేదు. సో.. నిన్నమొన్నటి వరకు టాలీవుడ్ ని ఒంటిచేత్తో ఏలిన ఈ మహారాణులిద్దరూ ఇప్పుడు కోలీవుడ్ అండ్ బాలీవుడ్ లో యమా బిజీ. అందుకే గుడ్ ఆల్టర్నేటివ్స్ కోసం చూస్తున్నారు తెలుగు డైరెక్టర్స్. మహేష్ తో త్రివిక్రమ్ చెయ్యబోయే హ్యాట్రిక్ మూవీలో మాళవిక మోహనన్ పేరు దాదాపుగా ఫైనల్ అయిందట. చరణ్- శంకర్ కాంబో కూడా ఈ కేరళమ్మాయి మీదే కాన్సన్ట్రేషన్ పెట్టిందట. కొరటాల-ఎన్టీయార్ మూవీలో జాన్వీకపూర్ ని దింపుతున్నట్టు వినికిడి. ఇంకా అవసరమైతే కృతి శెట్టి, నజ్రియా నజీమ్ లాంటి కొత్త కెరటాలకు ఎలివేషన్ ఇచ్చే ఆలోచనలో వున్నారు కొందరు డైరెక్టర్స్. సో.. ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు లేకుండానే షైన్ అవడానికి ప్రయత్నిస్తోంది రేపటి తెలుగు సినిమా.

మరిన్ని ఇక్కడ చదవండి :

Chiranjeevi: ప్రపంచ ర‌క్త‌దాతల దినోత్స‌వం సందర్భంగా సతీమణితో కలిసి రక్తదానం చేసిన మెగాస్టార్

Nithiin’s Maestro : స్పీడ్ పెంచిన యంగ్ హీరో.. ‘మ్యాస్ట్రో’ చివరి షెడ్యూల్ కూడా మొదలు పెట్టిన టీమ్..