AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: డెబ్యూ మూవీ బ్లాక్‌బస్టర్.. ఆ త‌ర్వాత టెంపో మిస్.. ఆ ద‌ర్శ‌కులు వీరే

డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న కొంతమంది డైరెక్టర్లు... అదే టెంపోను కంటిన్యూ చేయడంలో తడబడుతున్నారు. అవకాశం రాక కొందరు..

Tollywood: డెబ్యూ మూవీ బ్లాక్‌బస్టర్.. ఆ త‌ర్వాత టెంపో మిస్.. ఆ ద‌ర్శ‌కులు వీరే
First Movies Hit Directors
Ram Naramaneni
|

Updated on: Jun 13, 2021 | 4:16 PM

Share

డెబ్యూ మూవీతోనే బ్లాక్ బస్టర్ డైరెక్టర్ గా పేరుతెచ్చుకున్న కొంతమంది డైరెక్టర్లు… అదే టెంపోను కంటిన్యూ చేయడంలో తడబడుతున్నారు. అవకాశం రాక కొందరు.. వచ్చిన అవకాశాన్ని యుటిలైజ్ చేసుకోవడం తెలీక మరికొందరు..! ఇలా గోల్డెన్ డ్రీమ్స్ తోనే టైం పాస్ చేస్తున్న ఆ యువ దర్శకుల చిట్టా చాలా పెద్దదేనండోయ్!.  ఉప్పెన తర్వాత.. మళ్ళీ ఉప్పెనంత సినిమా చేస్తారని హోప్స్ క్రియేట్ చేసిన బుచ్చిబాబు ఇప్పుడెక్కడున్నారు? నాన్నకు ప్రేమతో టైంలో సుక్కూ శిష్యుడిగా తారక్ కి బాగా దగ్గరయ్యారు. ఆ రాపోతోనే ఓ కథ రాసి ఎన్టీయార్ తో ఓకే చేయించుకున్నారని వార్తలొచ్చాయి. కానీ.. ఎన్టీయార్ క్యాంప్ ఆ విషయాన్ని కన్ఫర్మ్ చెయ్యలేదు. తర్వాత మకాం మార్చి ఐకాన్ స్టార్ దగ్గర కనిపించారు. రీసెంట్ గా బన్నీ లైనప్ ని అనౌన్స్ చేసిన టీమ్.. అందులో బుచ్చిబాబు ప్రాజెక్టును ప్రస్తావించలేదు. దీంతో.. ఉప్పెన డైరెక్టర్ ఫ్యూచర్ పై మళ్ళీ డౌట్లు పుట్టేశాయి. బుచ్చిబాబుకొచ్చిన ఈ సిట్యువేషన్ టాలీవుడ్ లో కొత్తేమీ కాదు.

అర్జున్ రెడ్డితో తెలుగులో మిస్టర్ సెన్సేషన్ అనిపించుకున్న సందీప్ వంగా.. ఆ వెంటనే ముంబైకెళ్ళి… హిందీ కబీర్‌సింగ్‌ని బాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ గా మార్చి… అక్కడ కూడా హాట్ ఫేవరిట్ అయ్యారు. కాకపోతే.. నెక్స్ట్ మూవీ స్టార్ట్ చెయ్యడానికి చాలా గ్యాప్ తీసుకున్నారు. రన్ రాజా రన్ అనే ఒక్క సినిమాతోనే డార్లింగ్ మనసు దోచిన సుజీత్… సాహో మూవీతో పాన్ ఇండియా రేంజ్ కి దగ్గరయ్యారు. ఆ తర్వాతే సైలెంట్ అయ్యారు. మెగాస్టార్ లూసిఫర్ ఛాన్స్ వచ్చినట్టే వచ్చి చేజారింది సుజీత్ కి.

మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ కూడా అలా సడన్ గా ఎదిగిన మనిషే. ఎవడే సుబ్రహ్మణ్యం తర్వాత చేసిన మహానటి నాగీని నేషనల్ లెవల్ కి తీసుకెళ్లింది. తర్వాత ప్రభాస్ పాన్ వరల్డ్ మూవీ అనౌన్స్ చేసినా.. అతడి టాలెంట్ లెవల్స్ ఎంత పెరిగాయో చూడ్డానికి ఇంకా చాలా టైం పట్టేలా వుంది. కేరాఫ్ కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య లాంటి ఫీల్ గుడ్ మూవీస్ చేసిన వెంకటేష్ మహా.. నెక్స్ట్ లెవల్ కి చేరడానికి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలీదు. ప్రస్తుతానికి రాజశేఖర్ తో మర్డర్ మిస్టరీ చేస్తున్నారు వెంకటేష్ మహా. పెళ్లిచూపులు లాంటి ట్రెండ్ సెట్టర్ తీసి.. ఐదేళ్లవుతున్నా ఆ రేంజ్ సినిమా చెయ్యడానికి ఇంకా ఎదురుచూపులు తప్పలేదు తరుణ్ భాస్కర్ కి.

Also Read: హైద‌రాబాద్‌లో R15 బైక్‌పై వచ్చి కుక్క‌ కిడ్నాప్.. ఆచూకీ తెలిపినవారికి 10 వేల రివార్డ్

 భ‌ర్తతో గొడ‌వ‌పెట్టుకుని ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య‌.. ఆమె పెట్టె చెక్ చేసి అత‌డు కంగుతిన్నాడు

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ