Kangana Ranaut: ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్

|

Oct 27, 2023 | 8:06 AM

తన సొంత బాలీవుడ్ పైనే సెటైర్స్ వేసింది. అలాగే రాజకీయ నేతల పైన కూడా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన లవకుశ రామలీలా వేడుకలో రావణ దహనం చేయడంలో ఆమె విఫలమైంది. బాణం వేయలేక చాలా ఇబ్బంది పడింది కంగనా . ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో అందరూ కంగనా పై విమర్శలు గుప్పిస్తున్నారు.

Kangana Ranaut: ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌ను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తోన్న నెటిజన్స్
Kangana Ranaut
Follow us on

నటి కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీలతోనే కావాల్సినంత క్రేజ్ తెచ్చుకుంది. బాలీవుడ్ లో ఈ అమ్మడిని అందరూ ఫైర్ బ్రాండ్ అని పిలుస్తూ ఉంటారు. తన సొంత బాలీవుడ్ పైనే సెటైర్స్ వేసింది. అలాగే రాజకీయ నేతల పైన కూడా కామెంట్స్ చేసి వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉంటే ఢిల్లీలోని ఎర్రకోటలో జరిగిన లవకుశ రామలీలా వేడుకలో రావణ దహనం చేయడంలో ఆమె విఫలమైంది. బాణం వేయలేక చాలా ఇబ్బంది పడింది కంగనా . ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారడంతో అందరూ కంగనా పై విమర్శలు గుప్పిస్తున్నారు. గత 50 ఏళ్లలో రావణ దహనాన్ని పురుషులే చేశారు. ఈ ఏడాది కంగనాకు అవకాశం ఇచ్చారు. కానీ, ఈ పని  సరిగ్గా చేయలేకపోయింది. మూడుసార్లు ప్రయత్నించినా బాణం వదల్లేకపోయింది. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

రవాణా దహనం కార్యక్రమంలో కంగనా ట్రెడిషనల్ లుక్‌లోకనిపించింది. ఆమె వెంట ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా ఉన్నారు. ఆమె రవాణా దహనానికి బాణం వేయాలని ప్రయత్నించింది. బాణం వదలాలని ప్రయత్నించినా కుదరలేదు. ఎంత ప్రయత్నించినా ఆ బాణం ముందుకు వెళ్ళలేదు. అనంతరం ‘జై శ్రీరామ్‌’ అంటూ నినాదాలు చేసింది

‘నిజంగా విన్యాసాలు చేయడం అంత ఈజీ కాదు. వాళ్లంతా సినిమా ఇండస్ట్రీకి సరిపోతారు కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ‘సిక్కా ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోలేదు’ అని కొందరు రాసుకొచ్చారు. చాలా మంది కంగనాకు ట్రోల్స్ చేస్తున్నారు. సినిమాలో ఆమె చేసిన ఫైట్స్, బాణం విడుదల చేసే సీన్స్ ను పోల్చుతూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్స్.  ప్రభాస్ గతేడాది ‘లవకుశ రామ్ లీలా’లో రావణ దహనం చేశాడు. ‘ఆదిపురుష’ విడుదల సమయంలో ప్రభాస్‌కు ఈ అవకాశం వచ్చింది. అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ, అజయ్ దేవగన్, జాన్ అబ్రహం రావణ దహనం చేశారు. ఇక కంగనా సినిమాల విషయానికొస్తే.. కంగనా రనౌత్ నటించిన ‘తేజస్’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అక్టోబర్ 27న సినిమా విడుదలవుతోంది. ఆమె నటించిన ‘ఎమర్జెన్సీ’ ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.