Varalaxmi Sarathkumar: “అంత పొగరా”..? వరలక్ష్మీ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే

వరలక్ష్మీ శరత్ కుమార్.. ఈ పేరు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బాగా వినిపించింది. తమిళ్ లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న వరలక్ష్మీ ఇటీవల తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ సందడి చేశారు.

Varalaxmi Sarathkumar: అంత పొగరా..? వరలక్ష్మీ పై విరుచుకుపడుతున్న నెటిజన్లు.. కారణం ఏంటంటే
Varalakshmi Sarathkumar

Updated on: Aug 22, 2022 | 7:26 PM

వరలక్ష్మీ శరత్ కుమార్(Varalaxmi Sarathkumar).. ఈ పేరు ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో బాగా వినిపించింది. తమిళ్ లో సినిమాలు చేస్తూ అలరిస్తున్న వరలక్ష్మీ ఇటీవల తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంటూ సందడి చేశారు. ముఖ్యంగా ఆమె నటించిన క్రాక్ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాలో జయమ్మ పాత్రలో నటించి మెప్పించారు వరలక్ష్మీ శరత్ కుమార్. అలాగే ఇప్పుడు బాలకృష్ణ నటిస్తున్న NBK 107లోనూ నటిస్తున్నారు వరలక్ష్మీ. అలాగే సమంత నటిస్తున్న యశోద సినిమాలోనూ ఈ అమ్మడు కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటోంది ఈ చిన్నది. తాజాగా ఈ అమ్మడి పై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

తాజాగా వరలక్ష్మీ శరత్ కుమార్ చేసినస్ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది. తాజాగా నటి రాధికా శరత్ కుమార్ పుట్టిన రోజు జరిగింది. ఆమెకు విషెస్ తెలుపుతూ.. 60వ జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ.. లవ్ యూ.. మీరు మా అందరికీ ఆదర్శం. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అనేదానికి మీరే ఉదాహరణ అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్ పై కొంతమంది నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అమ్మ అని పిలవలేవా..? ఆంటీ అంటావేంటి..? పొగరా ..? అంటూ ఈ బ్యూటీని తిట్టిపోశారు. అయితే రాధికా వరలక్ష్మీ సొంత తల్లికాదన్న విషయం తెలిసిందే. ఆమెను ఆంటీ అనే పిలుస్తా.. అంతమాత్రానా మా మధ్య దూరం పెరిగినట్టు కాదు అని చెప్పుకొచ్చింది. మరి ఇప్పుడు వరలక్ష్మీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి