Sreeleela: శ్రీలీల మర్చిపోయి చెప్పేసిందా.. వీడియోతో పట్టేసిన నెటిజన్స్..
ధమాకా సినిమాతో శ్రీలీల పేరు మారుమోగింది. ఇందులో మాస్ మాహారాజా రవితేజ ఎనర్టీతోపాటు.. శ్రీలీల మాస్ డాన్సులు అదిరిపోయాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇటీవల దసరా సందర్భంగా విడుదలైన భగవంత్ కేసరి సినిమాలో మెరిసింది. ఇందులో నందమూరి బాలకృష్ణ కూతురిగా కనిపించింది. అంతేకాదు ఇప్పటివరకు యాక్టింగ్, డాన్స్ తో మెప్పించిన శ్రీలీల.. ఇందులో యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది.
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోన్న పేరు శ్రీలీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమై.. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించింది. ఓకే ఏడాదిలో దాదాపు అరడజనుకు పైగా సినిమాలను అనౌన్స్ చేసిందంటే తెలుగులో శ్రీలీల క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ధమాకా సినిమాతో శ్రీలీల పేరు మారుమోగింది. ఇందులో మాస్ మాహారాజా రవితేజ ఎనర్టీతోపాటు.. శ్రీలీల మాస్ డాన్సులు అదిరిపోయాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు క్యూ కట్టాయి. ఇటీవల దసరా సందర్భంగా విడుదలైన భగవంత్ కేసరి సినిమాలో మెరిసింది. ఇందులో నందమూరి బాలకృష్ణ కూతురిగా కనిపించింది. అంతేకాదు ఇప్పటివరకు యాక్టింగ్, డాన్స్ తో మెప్పించిన శ్రీలీల.. ఇందులో యాక్షన్ సీన్స్ అదరగొట్టేసింది. ఇక ఇప్పుడు ఆదికేశవ సినిమాతో మరోసారి అడియన్స్ ముందుకు రాబోతుంది. ఇందులో వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్నారు.
ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, ఆకట్టుకున్నాయి. ఇక మరోవైపు ఆదికేశవ చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఇటీవల ఈ సినిమా నుంచి లీలమ్మో సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులోనూ శ్రీలీల డాన్స్ అదరగొట్టేసింది. అయితే సాంగ్ లాంచ్ ఈవెంట్లో మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను చెప్పుకొచ్చింది. సీన్స్ డిమాండ్ చేస్తే లిప్ కిస్ ఇస్తారా అని అడగ్గా… ‘లిప్ కిస్ సీన్స్ చేయను. ఏ హీరోతోనూ చేయను. నేను లిప్ కిస్ ఇస్తే అది మొదటిసారిగా నా భర్తకే ఇస్తాను’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక శ్రీలీల చేసిన కామెంట్స్ నెట్టింట తెగ వైరలయ్యాయి. అయితే ఇప్పటివరకు బాగానే ఉంది కానీ… జనాలు ఊరుకుంటారా ?. హీరోహీరోయిన్స్ ప్రస్తుతం మాట్లాడిన మాటలు.. గతంలో మాటలకు సంబంధించిన వీడియోస్ తెగ షేర్ చేస్తుంటారు. ఇప్పుడు శ్రీలీల విషయంలోనూ అదే జరిగింది.
Nenu Lip Lock Scenes lo act Cheyanu Oka Vela Cheyalsi Vasta na Husband Ki Chesta
:- #Sreeleela
Meanwhile pic.twitter.com/wIPJmGr3xY
— Milagro Movies (@MilagroMovies) October 27, 2023
ఏ హీరోతోనూ లిప్ కిస్ చేయను అంటూ శ్రీలీల చెప్పడంతో నెట్టింట ఆమెకు సంబంధించిన ఫస్ట్ మూవీ వీడియో షేర్ చేస్తున్నారు. కన్నడలో కిస్ సినిమాతో తెరంగేట్రం చేసింది శ్రీలీల. ఈ చిత్రాన్ని తెలుగులో ఐ లవ్ యు ఇడియట్ సినిమాతో డబ్ చేశారు. అయితే ఆ మూవీలో హీరోకు లిప్ కిస్ ఇస్తుంది శ్రీలీల. ఓపాటలో హీరోహీరోయిన్స్ మధ్య లిప్ కిస్ ఉన్న సీన్ కొద్ది సేపు మాత్రమే ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ చిన్న క్లిప్ ను తెగ షేర్ చేస్తున్నారు నెటిజన్స్. లిప్ కిస్ ఎవ్వరికి ఇవ్వను అంటూ చెప్పింది. కానీ మొదటి సినిమాలోనే లిపి కిస్ ఇచ్చింది.. అబద్ధం చెప్పిందా ?లేక మర్చిపోయి అలా చెప్పేసిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి శ్రీలీల అలా కామెంట్స్ చేసిందో లేదో.. అప్పుడే వీడియోను తెగ వైరల్ చేస్తున్నారు.
Veedu husband ah aithe 😂pic.twitter.com/uOFsFu3qvo
— Lohith_Rebelified🔥🦖 (@Rebelism_18) October 27, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.