Adipurush: ఆదిపురుష్ నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన డైరెక్టర్ ఓంరౌత్.. ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..

|

Apr 10, 2022 | 11:44 AM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ (Om Raut) కాంబోలో వస్తోన్న చిత్రం ఆదిపురుష్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్

Adipurush: ఆదిపురుష్ నుంచి స్పెషల్ వీడియో షేర్ చేసిన డైరెక్టర్ ఓంరౌత్.. ట్రోల్ చేస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్..
Adipurush
Follow us on

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas).. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ (Om Raut) కాంబోలో వస్తోన్న చిత్రం ఆదిపురుష్. ఇందులో బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్.. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలలో నటిస్తున్నారు. రామాయణ గాధ ఆధారంగ తెరకెక్కుతున్న ఈ మూవీలో ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తోన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అంతేకాకుండా.. ఈ సినిమాను 3D వెర్షన్‏లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపారు. అయితే మొదటి సారి ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తుండడంతో ఈ మూవీపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఆదిపురుష్ సినిమాను చూసేందుకు ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ మూవీ ఫస్ట్ లుక్.. గ్లింప్స్ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న అభిమానులకు శ్రీరామనవమి సందర్భంగా ఊహించని సర్ ప్రైజ్ ఇచ్చాడు డైరెక్టర్ ఓంరౌత్.

శ్రీరామనవమి సందర్భంగా.. ప్రభాస్ ఫ్యాన్స్‏కు స్పెషల్ సర్ ప్రైజ్ ఇస్తూ ఓ వీడియోను షేర్ చేశాడు డైరెక్టర్ ఓంరౌత్.. అందులో ఆదిపురుష్ ప్రకటించినప్పటి నుంచి ప్రభాస్ ఫ్యాన్స్ ఆతడిని రాముడి పాత్రలో ఊహిస్తూ రెడీ చేసిన ఫ్యాన్ మేడ్ పోస్టర్స్ అన్నింటిని కలిపి ఓ వీడియోగా రిలీజ్ చేశారు. ఇందులో ఆదిపురుష్ విడుదల తేదీని కూడా ప్రకటించారు. అయితే శ్రీరామనవమి కానుకగా ఆదిపురుష్ ఫస్ట్ లుక్ వస్తుందనుకున్న అభిమానులకు మాత్రం డైరెక్టర్ ఓంరౌత్ షేర్ చేసిన వీడియో అంతంగా సంతృప్తినివ్వలేదనే తెలుస్తోంది. ట్విట్టర్ వేదికలో ప్రభాస్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభాస్ ప్రస్తుతం సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కే సినిమాలు చేస్తున్నాడు. ఇటీవల విడుదలైన రాధేశ్యామ్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

Also Read: NTR Jr.-Koratala Shiva: తారక్ సినిమాపై క్రేజీ అప్డేట్.. కొరటాల.. ఎన్టీఆర్ మూవీ డేట్ ఫిక్స్ ?..

Viral Photo: ప్రకృతి అందాల నడుమ అందాల రాశి.. ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి..

Pakka Commercial: ఓటీటీలోకి గోపీచంద్ సినిమా.. పక్కా కమర్షియల్ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..

Malaika Arora: యక్సిడెంట్ తర్వాత తొలిసారి నోరు విప్పిన హీరోయిన్.. ఇప్పటికీ నమ్మశక్యంగా లేదంటూ..