Rajamouli : ట్యాలెంట్ ఉంటే అంతే మరి.. అప్పుడు బాలేదన్నారు.. ఇప్పుడేమో ఏకంగా.. కాళ్ల దగ్గరికి..

|

Jul 16, 2022 | 4:02 PM

బ్యాక్‌టుబ్యాక్ పన్నెండు సినిమాల్ని బ్లాక్‌బస్టర్లుగా మలిచి.. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కంటిన్యూ అవుతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli).పాన్ ఇండియా సినిమాను..

Rajamouli : ట్యాలెంట్ ఉంటే అంతే మరి.. అప్పుడు బాలేదన్నారు.. ఇప్పుడేమో ఏకంగా.. కాళ్ల దగ్గరికి..
Netflix Offer Rajamouli
Follow us on

బ్యాక్‌టుబ్యాక్ పన్నెండు సినిమాల్ని బ్లాక్‌బస్టర్లుగా మలిచి.. సక్సెస్ ఫుల్ దర్శకుడిగా కంటిన్యూ అవుతున్నారు దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli).పాన్ ఇండియా సినిమాను మొదలుపెట్టి లార్జర్ దెన్ లైఫ్ అనే ట్యాగ్‌తో వరల్డ్‌ వైడ్‌ అందర్నీ తన వైపు తిప్పుకున్నారు. తిప్పుకోవడమే కాదు.. తన సినిమానే ఓ కేస్‌ స్టడీగా మారేట్లు చేసి.. పాత, కొత్త డైరెక్టర్లందరూ తననే ఫాలో అయ్యేలా చేస్తున్నారు. డైరెక్టర్లు మాత్రమే కాదు.. పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, ఓటీటీ యాజమానులు కూడా తనతో సినిమా తీసేందుకు వెయిట్ చేసేలా చేసుకున్నారు. ఇక త్వరలో ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ (Netflix) తో భారీ డీల్ చేసుకోబోతున్నారు.

లేటెస్ట్ బజ్‌ ప్రకారం త్వరలో నెట్‌ ఫ్లిక్స్ తో కలువబోతున్నున్నారు జక్కన్న . ఆ సంస్థ కోసం పాన్ వరల్డ్ రేంజ్లో ఓ వెబ్‌ సిరీస్‌ను తెరకెక్కించబోతున్నారు కూడా…! అయితే ఇదే విషయమై తాజాగా మరోసారి జక్కన్నను కలిసిందట నెట్‌ ఫ్లిక్స్ . భారీగా రెమ్యూనరేషన్, బడ్జెట్‌లో ఫ్రీ హ్యాండ్ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్టు చెప్పిందట. దీంతో ఫుల్ హ్యాపీగా ఫీలైన రాజమౌళి.. నెట్‌ఫ్లిక్స్ కు ఓకే చెప్పారట. అయితే ఇది ఇంకా చర్చల దశలోనే ఉందని ఇండస్ట్రీలో టాక్.

ఇక గతంలో ‘బాహుబలి: బిఫోర్‌ ది బిగినింగ్‌’ పేరుతో నెట్‌ఫ్లిక్స్‌ ఓ వెబ్‌సిరీస్‌ను ప్రారంభించింది. అయితే, కొన్ని రోజులకే ఆ ప్రాజెక్టును రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తాము ఆశించిన స్థాయిలో మేకింగ్‌ లేదని.. ఆ మొత్తం స్క్రిప్ట్, తెరకెక్కించిన సన్నివేశాలను పక్కన పెట్టేసింది. అయితే రీసెంట్ గా రిలీజైన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) తో రాజమౌళి స్టామినా ఏంటో మరోసారి వరల్డ్ వైడ్‌ తెలిసిపోయింది. ఈయన డైరెక్షన్‌కు హాలీవుడ్‌ కూడా కదులుతోంది. దీంతో మళ్లీ రాజమౌళి దగ్గరకే వచ్చింది నెట్‌ఫ్లిక్స్. ఇక ఇదే విషయం నెట్టింట వైరల్ అవడంతో.. నెట్‌ ఫ్లిక్స్ తీరుపై నెటిజెన్లు ఫైర్ అవుతున్నారు. అప్పుడు బాలేదని .. ఇప్పుడు కాళ్ల దగ్గరికి రావడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. మరికొంత మందూమో.. ట్యాలెంట్ ఉంటే ఇలాగే ఉంటది అంటూ.. జక్కన్న ను ఆకాశానికెత్తేస్తున్నారు.