Prabhas: సెట్‏లో ప్రభాస్‏ను కలిసిన నెట్‏ఫ్లిక్స్ సీఈవో.. యంగ్ రెబల్ స్టార్ లుక్ చూశారా ?..

నిన్న నందమూరి ఎన్టీఆర్ ఫ్యామిలీని కలిశారు. తారక్ ఇంట్లో లంచ్ చేసి కళ్యాణ్ రామ్, డైరెక్టర్ కొరటాల శివలతో మాట్లాడారు. ఇక నిన్న రాత్రి అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ లతో స్పెషల్ డిన్నర్ చేశార. ఈ విందులో మైత్రి మేకర్స్ సైతం పాల్గొన్నారు. ఆ తర్వాత రామానాయుడు స్టూడియోలో టెడ్ సరండోస్ అండ్ టీంకు స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయగా.. వెంకటేష్.. నాగ చైతన్య, రాజమౌళి, సురేష్ బాబు, దుల్కర్ సల్మాన్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

Prabhas: సెట్‏లో ప్రభాస్‏ను కలిసిన నెట్‏ఫ్లిక్స్ సీఈవో.. యంగ్ రెబల్ స్టార్ లుక్ చూశారా ?..
Prabhas

Updated on: Dec 09, 2023 | 4:13 PM

టాలీవుడ్ స్టార్ సెలబ్రెటీలను వరుసగా కలుస్తున్నారు నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్. కొద్ది రోజులుగా హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన తన టీం మెంబర్స్‏తో కలిసి స్టార్స్ అందరిని కలుస్తూ ఆశ్చర్యపరుస్తున్నారు. మొన్న మెగాస్టార్ చిరంజీవి నివాసంలో రామ్ చరణ్, సాయి ధరమ్, తేజ్, చిరంజీవి, వైష్ణవ్ తేజ్ లను కలిసి వారితో ముచ్చటించారు. ఇక నిన్న నందమూరి ఎన్టీఆర్ ఫ్యామిలీని కలిశారు. తారక్ ఇంట్లో లంచ్ చేసి కళ్యాణ్ రామ్, డైరెక్టర్ కొరటాల శివలతో మాట్లాడారు. ఇక నిన్న రాత్రి అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ లతో స్పెషల్ డిన్నర్ చేశార. ఈ విందులో మైత్రి మేకర్స్ సైతం పాల్గొన్నారు. ఆ తర్వాత రామానాయుడు స్టూడియోలో టెడ్ సరండోస్ అండ్ టీంకు స్పెషల్ పార్టీ ఏర్పాటు చేయగా.. వెంకటేష్.. నాగ చైతన్య, రాజమౌళి, సురేష్ బాబు, దుల్కర్ సల్మాన్ తోపాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.

అలాగే ఈరోజు ఉదయం గుంటూరు కారం మూవీ షూటింగ్ సెట్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు, డైరెక్టర్ త్రివిక్రమ్ లను కలిసి మాట్లాడారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ మహేష్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చరణ్, తారక్, బన్నీ, మహేష్ బాబును కలుసుకున్న టెడ్ సరండోస్ టీం..ఇప్పుడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ను కలిశారు. ప్రస్తుతం కల్కి మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఈ క్రమంలో షూటింగ్ సెట్ లోనే నెట్ ఫ్లిక్స్ టీంను కలుసుకున్నారు. అక్కడే ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్, నిర్మాతలు ప్రియాంక దత్, స్వప్న దత్ లను కలిశారు. అనంతరం కల్కి చిత్రయూనిట్ తో కలిసి ఫోటోస్ దిగారు. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. ప్రభాస్ న్యూలుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఫుల్ గడ్డం, మీసాలతో ప్రభాస్ చాలా రగ్గడ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఇప్పటివరకు ప్రభాస్ ఎప్పుడూ ఇలాంటి లుక్ లో కనిపించలేదు. అంతేకాదు.. ఇప్పటివరకు కల్కి నుంచి విడుదలైన ఏ పోస్టర్ లోనూ ప్రభాస్ ఈ తరహా లుక్ లో కనిపించలేదు. దీంతో కల్కి సినిమాలో డార్లింగ్ పాత్ర పై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ ద్విపాత్రాభినయం చేయనున్నారా ? అంటున్నారు ఫ్యాన్స్. మొత్తానికి సరికొత్త లుక్ లో అభిమానులకు షాకిచ్చాడు ప్రభాస్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.