Nayanthara Vignesh Wedding: కొత్త జంటకు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోన్న విషెస్..

|

Jun 09, 2022 | 10:39 AM

నయనతార(Nayanthara), విఘ్నేష్ శివన్(Vignesh) వివాహం నేడు మహాబలిపురంలో జరిగింది. నేటి ఉదయం నయన్ విఘ్నేష్ 2: 22 గంటల సమయంలో వీరి వివాహం జరిగిందని తెలుస్తుంది.

Nayanthara Vignesh Wedding: కొత్త జంటకు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోన్న విషెస్..
Nayanthara Vignesh
Follow us on

నయనతార(Nayanthara), విఘ్నేష్ శివన్(Vignesh) వివాహం నేడు మహాబలిపురంలో జరిగింది. నేటి ఉదయం నయన్ విఘ్నేష్ 2: 22 గంటల సమయంలో వీరి వివాహం జరిగిందని తెలుస్తుంది. ఈ మేరకు విఘ్నేష్ తన సోషల్ మీడియాలో స్టోరీ పోస్ట్ చేశారు. ఇక నయన్ విఘ్నేష్ చాలా కాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇక వీరి పెళ్లి పై గతంలో చాలా వార్తలు పుట్టుకొచ్చాయి. అయితే ఆసమయంలో ఇద్దరూ సైలెంట్ గా ఉన్నారు. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించిన నేను రౌడీనే  సినిమాలో నయనతార నటించిన విషయం తెలిసిందే.. ఆ సినిమా సమయంలో ఏర్పడ్డ వారి స్నేహం ప్రేమగా మారింది. అయితే తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు ఈ జంట. అయితే సోషల్ మీడియాలో ఈ ఇద్దరూ షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు వీరి మధ్య ఉన్న ప్రేమను బయటపెట్టాయి.

ఇక ఇప్పుడు అధికారికంగా వీరు ఒక్కటయ్యారు. మహాబలిపురంలోని ఓ స్టార్ హోటల్లో నయన్ విఘ్నేష్ వివాహం జరిగింది. ఈ పెళ్ళికి అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే హాజరయ్యారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ ఈ వివాహానికి హాజరయ్యారని తెలుస్తుంది. నిజానికి ముందు నయన్ విఘ్నేష్  పెళ్లిని తిరుమ‌ల‌లో చేసుకోవాల‌ని అనుకున్నారు. అయితే ప్రయాణ పరమైన ఇబ్బందులు కారణంగా పెళ్లివేదికను మహాబలి పురానికి మార్చుకున్నారు. అయితే విఘ్నేష్ శివన్ తన పెళ్లి ముహుర్తాన్ని ఇన్‌స్టా గ్రామ్ స్టోరీలో షేర్ చేశాడు. దీనిబట్టి జూన్ 6(ఈ రోజు) తెల్లవారుజామున 2:22 నిమిషాలకు నయన్, విఘ్నేష్ వివాహం జరిగిందని తెలుస్తుంది. దాంతో సోషల్ మీడియాలో అభిమానులు, సినిమా తారలు పెద్ద ఎత్తున ఈ కొత్తజంటకు విషెస్ తెలుపుతున్నారు. నయన్, విఘ్నేష్ కలిసున్నా ఫోటోలను షేర్ చేస్తూ విషెస్ తెలుపుతున్నారు.

ఇవి కూడా చదవండి