Nayanthara: భారతీయ సినిమా చరిత్రలోనే మొదటిసారిగా.. అర్ధరాత్రి విడుదల కానున్న నయన్ మూవీ ట్రైలర్.. ఎందుకంటే?
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న కనెక్ట్ డిసెంబర్ 22న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడు పెంచింది చిత్రబృందం. వరుస అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు
సాధారణంగా పెళ్లయ్యాక సినిమాలు తగ్గించేస్తారు మన సినీతారలు. లేక కొద్ది గ్యాప్ తీసుకునో మళ్లీ ముఖానికి మేకప్ వేసుకుంటారు. అయితే లేడీ సూపర్ స్టార్ నయనతార మాత్రం పెళ్లయ్యాక వరుస ప్రాజెక్టులకు ఓకే చెప్పింది. ఇటీవలే గాడ్‌ఫాదర్‌తో మరొక సూపర్ హిట్‌ను ఖాతాలో వేసుకున్న నయన్ త్వరలోనే కనెక్ట్ అనే హర్రర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. కథానాయిక ప్రనధానంగా సాగే ఈ సినిమాలో వాన ఫేం వినయ్ రాజ్, సత్యరాజ్, అనుపమ్ ఖేర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహిస్తున్నారు. మయూరి లాంటి హిట్ సినిమా తర్వాత అశ్విన్-నయన్ కాంబినేషన్‌లో వస్తోన్న రెండో చిత్రమిది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోన్న కనెక్ట్ డిసెంబర్ 22న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. దీంతో ప్రమోషన్లలో స్పీడు పెంచింది చిత్రబృందం. వరుస అప్‌డేట్‌లు ఇస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. తాజాగా మూవీ మేకర్స్ మరో బిగ్ అప్‌డేట్‌ను ప్రకటించారు. నయనతార సినిమా ట్రైలర్‌ను గురువారం అర్ధరాత్రి 12గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
బజ్ పెంచేందుకే..
కాగా అర్ధరాత్రి ఓ సినిమా ట్రైలర్‌ను విడుదల చేయడం భారతీయ సినిమా చరిత్రలోనే ఇదే మొదటిసారి. ఇది పూర్తి హర్రర్ సినిమా కావడంతో మిడ్‌నైట్‌కు ట్రైలర్ రిలీజ్ చేస్తే ఇంకా మంచి బజ్ వస్తుందని మూవీ మేకర్స్ భావిస్తున్నారట. కాగా అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి ఇటీవల ఓ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. దీనికి మంచి స్పందన వచ్చింది. కనెక్ట్ సినిమాను రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నయనతార భర్త విఘ్నేష్ శివన్ నిర్మించాడు. ఇక తెలుగులో యూవీ క్రియేషన్స్ బ్యానర్ నయనతార సినిమాను రిలీజ్ చేయనుంది. పృథ్వి చంద్రశేఖర్ మ్యూజిక్ అందించిన చిత్రానికి మణికందన్, కృష్ణమాచారి సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వర్తించారు.
Get ready to be scared ?#Nayanthara‘s Spooky tale #Connect Telugu trailer releasing 9th December Mid Night 12AM !!!#ConnectfromDec22 ?@AnupamPKher #Sathyaraj #VinayRai Directed by @Ashwin_saravana Produced by @Rowdy_Pictures @VigneshShivN @UV_Creations pic.twitter.com/XRILe6gXv4
— UV Creations (@UV_Creations) December 6, 2022
కాగా కనెక్ట్ సినిమా తర్వాత బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌తో కలిసి జవాన్ సినిమాలో నటిస్తోంది నయనతార. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే సౌతిండియన్ సూపర్‌స్టార్‌గా గుర్తింపు పొందిన నయన్‌కు ఇదే మొదటి బాలీవుడ్ సినిమా కావడం విశేషం. ఇవి కాకుండా అహ్మద్ డైరెక్షన్‌లో జయం రవి హీరోగా ఇరైవన్ సినిమాతో పాటు విఘ్నేష్ శివన్, అజిత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఏకే 62 చిత్రంలోనూ నయన్ హీరోయిన్‌గా నటిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..