Nayanthara: యాడ్స్‏తో ట్రెండ్ సెట్టర్.. సొంతంగా కాస్మోటిక్స్ బ్రాండ్ లాంచ్ చేసిన నయన్..

ఇటీవల జవాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. తొలిసారి బీటౌన్ బాద్ షా షారుఖ్ జోడిగా కనిపించిన నయన్.. అటు నార్త్ అడియన్స్ హృదయాలను దొచేసింది. పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాతో నయన్ క్రేజ్ సైతం మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీకి హిందీలో మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది.

Nayanthara: యాడ్స్‏తో ట్రెండ్ సెట్టర్.. సొంతంగా కాస్మోటిక్స్ బ్రాండ్ లాంచ్ చేసిన నయన్..
Nayanthara

Updated on: Sep 28, 2023 | 5:10 PM

దక్షిణాది చిత్రపరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ గా ఇమేజ్ సొంతం చేసుకుంది నయనతార. తమిళం, తెలుగులో అనేక చిత్రాల్లో నటించిన నయన్..ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్ కాబోతుంది. ఇటీవల జవాన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ ఖాతాలో వేసుకుంది. తొలిసారి బీటౌన్ బాద్ షా షారుఖ్ జోడిగా కనిపించిన నయన్.. అటు నార్త్ అడియన్స్ హృదయాలను దొచేసింది. పాన్ ఇండియా లెవల్లో సంచలనం సృష్టించిన ఈ సినిమాతో నయన్ క్రేజ్ సైతం మారిపోయింది. ఇప్పుడు ఈ బ్యూటీకి హిందీలో మరిన్ని అవకాశాలు క్యూ కడుతున్నట్లుగా తెలుస్తోంది.

ఓవైపు వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. మరోవైపు వ్యాపార రంగంలోనూ బిజీ అయిపోతుంది. ఇప్పటికే తన భర్త విఘ్నేశ్ శివన్ తో కలిసి సినీ నిర్మాతగా కొనసాగుతుంది. రౌడీ పిక్చర్స్ నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి పలు చిత్రాలు నిర్మిస్తుంది. అటు విదేశాల్లోనూ పలు వ్యాపారాల్లో నయన్ పెట్టుబడులు ఉన్నాయి. ఇక ఇప్పుడు సొంతంగా కాస్మెటిక్ బ్రాండ్ ప్రారంభించింది. ‘9 SKIN’ పేరుతో చర్మ సంరక్షణ ఉత్పత్తులను రెడీ చేస్తుంది. సీరమ్స్, క్రీములతో ప్రత్యేక శ్రేణి ఉత్పత్తులను మార్కెట్లో ప్రవేశపెడుతుంది. కొద్ది రోజులుగా ఈ బ్రాండ్ కు సంబంధించిన ఫోటోస్ తన సోషల్ మీడియా ఖాతాలలో షేర్ చేస్తుంది. తాజాగా ఈ బ్రాండ్ పేరుతో నయన్ షేర్ చేసిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇప్పటికే సినీరంగంలో దాదాపు రూ.200 కోట్లకు పైగా సంపాదించిన నయన్.. ఇప్పుడు బిజినెస్ లో పెద్ద మొత్తంలో సంపాదిస్తుంది. పారితోషికాలు, బ్రాండ్ కాంట్రాక్ట్స్ ఇలా ఒక్కటేమిటీ అనేక విధాలుగా నయన్ దూసుకుపోతుంది. ఇటీవలే జవాన్ చిత్రంలో నటించిన నయన్.. చేతిలో మరిన్ని చిత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే మంచు విష్ణు ప్రధాన పాత్రలో రాబోతున్న భక్త కన్నప్ప చిత్రంలోనూ నయన్ కీలకపాత్ర పోషించనుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.