Nayanthara Wedding: తమ పెళ్లి వేడుక ఎక్కడో క్లారిటీ ఇచ్చేసిన విఘ్నేష్ శివన్.. ఎవరెవరు వస్తున్నారంటే

పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడు అడుగులు మాత్రమే కాదు.. పెళ్లంటే జీవిత కాల ప్రయాణం.. అయితే ఈ ప్రయాణాన్ని మరో రెండు రోజుల్లో మొదలెట్టేస్తున్నారు నయన్ అండ్ విఘ్నేష్ కపుల్.

Nayanthara Wedding: తమ పెళ్లి వేడుక ఎక్కడో క్లారిటీ ఇచ్చేసిన విఘ్నేష్ శివన్.. ఎవరెవరు వస్తున్నారంటే
Nayan Vignesh

Edited By:

Updated on: Jun 08, 2022 | 12:03 PM

పెళ్లంటే మూడు ముళ్లు.. ఏడు అడుగులు మాత్రమే కాదు.. పెళ్లంటే జీవిత కాల ప్రయాణం.. అయితే ఈ ప్రయాణాన్ని మరో రెండు రోజుల్లో మొదలెట్టేస్తున్నారు నయన్(Nayanthara)అండ్ విఘ్నేష్(Vignesh Shivan)కపుల్. ఇప్పటికే చాలా సార్లు.. పెళ్లైందనే వార్తల నేపథ్యంలో.. పెళ్లి కాకున్నా.. ఒకే ఇంట్లో ఉంటున్నారనే పుకార్ల మధ్య.. పెళ్లికి తల్లిదండ్రులింకా ఒప్పుకోలేదనే.. నెట్టింటి ప్రచారం నేపథ్యంలో.. ఎట్టకేలకు వీరు పెళ్లి పీటలెక్కన్నారు. ఇట్స్ కన్ఫర్మ్‌ అనే ట్యాగ్ తో నెట్టింట వైరల్ అవుతున్నారు నయన్,విఘ్నేష్ . ఇక రీసెంట్‌ గా తమ పెళ్లి విషయాలను మీడియాతో పంచుకున్నారు డైరెక్టర్ విఘ్నేష్ శివన్. తాజాగా ఓ ఇంట్రవ్యూలో మాట్లాడుతూ.. తమ పెళ్లి జూన్ 9 మహాబలిపురంలో జరగనుందని క్లారిటీగా చెప్పారు. అంతేకాదు పెళ్లికి సంబంధించిన మరిన్ని విషయాలను కూడా చెప్పేశారు.

“మై లవ్‌ నయన్‌ను పెళ్లిని చేసుకోబోతున్నాను. జూన్​ 9 న నేను, నయనతార మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు. నిజానికి ముందుగా తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. కానీ అక్కడ ప్రయాణపరంగా కొన్ని సమస్యలు ఉంటాయనిపించడంతో మా పెళ్లి వేదికను మహాబలిపురానికి మార్చాం. జూన్ 9న ఉదయం పెళ్లి జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫొటోలను మధ్యాహ్నం షేర్​ చేస్తాం. జూన్​ 11న నేను, నయన్ మీ అందరినీ ప్రత్యేకంగా కలుస్తాం. అంటూ చెప్పుకొచ్చారు విఘ్నేష్.

ఇవి కూడా చదవండి