Nayanthara Vignesh Wedding: మంచి మనసు చాటుకున్న కొత్త జంట.. లక్షమందికి అన్నదానం

|

Jun 09, 2022 | 12:25 PM

ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నయనతార(Nayanthara), విఘ్నేష్ శివన్(Vignesh) వివాహం నేడు ఘనంగా జరిగింది.

Nayanthara Vignesh Wedding: మంచి మనసు చాటుకున్న కొత్త జంట.. లక్షమందికి అన్నదానం
Nayanthara And Vignesh
Follow us on

ప్రేక్షకులు, అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. నయనతార(Nayanthara), విఘ్నేష్ శివన్(Vignesh) వివాహం నేడు ఘనంగా జరిగింది. నేటి ఉదయం 2: 22 నిమిషాలకు నయన్ విఘ్నేష్ వివాహం జరిగింది. ఈ వివాహ వేడుకకు అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు, పలువురు సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహానికి సూపర్ స్టార్ రజినీకాంత్, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్, బడా ప్రొడ్యూసర్ బోనికపూర్, డైరెక్టర్ మణిరత్నం, అట్లీ, రాధికా శరత్ కుమార్, విజయ్ సేతుపతి, ఎస్ జే సూర్య , కార్తీ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే నయన్ , విఘ్నేష్ మంచి మనసును చాటుకున్నారు. తమ పెళ్లి సందర్భంగా అనాధాశ్రమాలలో.. వృధాశ్రమాలలో.. పలు ప్రముఖ దేవాలయాలలో అన్నదాన కార్యక్రమమం నిర్వహించనున్నారు.

నేడు తమ వివాహం సందర్భంగా నేటి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. తమిళనాడులోని పలు ప్రాంతాల్లో లక్ష మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అనాధ శరణాలయాలు, వృద్ధాశ్రమాలు , తిరువణ్ణామలైతో సహా ప్రధాన ఆలయాలలో వివాహ విందును నిర్వహించడానికి స్టార్ జంట ఏర్పాట్లు చేసింది. ఈ నిర్ణయం పై ప్రసంశలు కురిపిస్తున్నారు. ఇక ఈ జంట వివాహానికి స్టార్‌ హీరోలు అజిత్‌, కార్తీ, విజయ్‌తో పాటు టాలీవుడ్‌ స్టార్స్ కూడా హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఇక కొత్తజంటకు విషెస్ తెలుపుతూ.. సోషల్ మీడియాలో అభిమానులు సందడి చేస్తున్నారు. నయన్, విఘ్నేష్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులు తమ ప్రేమను కురిపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి