Naveen Polishetty: ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన నవీన్ పోలిశెట్టి.. కారణం ఇదే

తొలి సినిమాతోనే తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అనుదీప్ దర్శకత్వం వహించిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు ఆయన క్రేజ్ ఓ రేంజ్ లోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బడా బ్యానర్ యువీ క్రియేషన్స్ తో కలిసి సినిమా చేస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్నాడు నవీన్. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా చేస్తున్నారు. 

Naveen Polishetty: ప్రేక్షకులకు క్షమాపణలు చెప్పిన నవీన్ పోలిశెట్టి.. కారణం ఇదే
Naveen Polishetty

Updated on: Sep 04, 2023 | 10:17 AM

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి.. హీరోగా సినిమాలు చేయక ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో సైడ్ క్యారెక్టర్ లో కనిపించాడు నవీన్ ఆతర్వాత బాలీవుడ్ లోనూ నటించాడు. ఇక ఈ కుర్ర హీరో తొలి సినిమా ఏజెంట్ శ్రీనివాస్ ఆత్రేయ మూవీ సూపర్ హిట్ గా నిలించింది. తొలి సినిమాతోనే తన కామెడీతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆతర్వాత వచ్చిన జాతిరత్నాలు సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది. అనుదీప్ దర్శకత్వం వహించిన జాతిరత్నాలు సినిమా సూపర్ హిట్ గా నిలవడంతో ఇప్పుడు ఆయన క్రేజ్ ఓ రేంజ్ లోకి వెళ్ళింది. ఈ క్రమంలోనే ఇప్పుడు బడా బ్యానర్ యువీ క్రియేషన్స్ తో కలిసి సినిమా చేస్తున్నారు. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి అనే సినిమాలో నటిస్తున్నాడు నవీన్. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ అనుష్క హీరోయిన్ గా చేస్తున్నారు.

డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 7 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో ఎక్కడా కూడా అనుష్క కనిపించడం లేదు. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యత మొత్తం నవీన్ ఒక్కడే మీదేసుకున్నాడు. ఇప్పటికే ఆయన ఊరూరా తిరుగుతూ సినిమాను ప్రచారం చేసుకుంటున్నారు. పలు షోలకు గెస్ట్ గా వెళ్లి తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నాడు.

నవీన్ పోలిశెట్టి ఇన్ స్టా గ్రామ్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..