Miss Shetty Mr Polishetty Review : శెట్టి, పొలిశెట్టి కలిసి సూపర్ హిట్ కొట్టేశారుగా..!

జాతిరత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టి పేరు మారుమోగింది. తను పేల్చిన నవ్వులు ఇప్పటికి పేలుతూనే ఉంటాయి. అలాంటి నవీన్ తన నెక్స్ట్ మూవీ టాప్ హీరోయిన్ అనుష్కతో కలిసి చేస్తున్నాడంటే అందరు నవ్వుకున్నారు. నవీన్ పక్కన అనుష్క హీరోయినా అంటూ మాట్లాడుకున్నారు. నవ్విన నాపచేనే పండినట్లు... వాళ్లిద్దరు కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమా చేశారు. ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీని పెంచిన ఈ మూవీ... ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది.

Miss Shetty Mr Polishetty Review : శెట్టి, పొలిశెట్టి కలిసి సూపర్ హిట్ కొట్టేశారుగా..!
Miss Shetty Mr Polishetty

Edited By:

Updated on: Sep 07, 2023 | 3:29 PM

జాతిరత్నాలు తర్వాత నవీన్ పొలిశెట్టి పేరు మారుమోగింది. తను పేల్చిన నవ్వులు ఇప్పటికి పేలుతూనే ఉంటాయి. అలాంటి నవీన్ తన నెక్స్ట్ మూవీ టాప్ హీరోయిన్ అనుష్కతో కలిసి చేస్తున్నాడంటే అందరు నవ్వుకున్నారు. నవీన్ పక్కన అనుష్క హీరోయినా అంటూ మాట్లాడుకున్నారు. నవ్విన నాపచేనే పండినట్లు… వాళ్లిద్దరు కలిసి మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి అనే సినిమా చేశారు. ప్రేక్షకుల్లో ఎంతో క్యూరియాసిటీని పెంచిన ఈ మూవీ… ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మాస్టర్ చెఫ్ గా అనుష్క, స్టాండప్ కమెడియన్ గా నవీన్ ఎలా సందడి చేశారు, వాళ్లిద్దరి మధ్య ఉన్న రిలేష్ షిప్ ఏంటీ అనేది రివ్యూలోకి వెళ్లి చదువుకుందాం.

నటీనటులు- అనుష్క శెట్టి, నవీన్ పొలిశెట్టి, సోనియా దీప్తి, మురళీశర్మ, నాజర్, జయసుధ తదితరులు

రచన-దర్శకత్వం- మహేశ్ బాబు.పి

సంగీతం- రదన్

నేపథ్య సంగీతం- గోపిసుందర్

సినిమాటోగ్రఫి- నీరవ్ షా

నిర్మాణ సంస్థ- యూవీ క్రియేషన్స్

రిలీజ్ డేట్- 07-09-2023

కథేంటంటే….

అన్విత శెట్టి(అనుష్క) ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో మాస్టర్ చెఫ్. తల్లి(జయసుధ) అనారోగ్యం కారణంగా లండన్ నుంచి ఇండియాకు తిరిగి వస్తుంది. తల్లి చనిపోవడంతో ఒంటరిగానే ఉంటుంది. ప్రేమ, పెళ్లికి దూరంగా ఉండాలనుకుంటుంది. కానీ ఓ బిడ్డకు తల్లి కావాలనేది తన తప్పన. అయితే అది శారీరకంగా కాకుండా IUI పద్దతిలో బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది. ఇందుకోసం స్పర్మ్ డోనర్స్ ను వెతుకుతుంది. ఆ క్రమంలో స్టాండప్ కమెడియన్ అయిన సిద్ధు పొలిశెట్టి(నవీన్ ) అన్వితకు తారాసపడతాడు. తన ద్వారా బిడ్డకు జన్మనివ్వాలని అన్విత భావిస్తుంది. సిద్ధు గురించి, అతని కుటుంబ నేపథ్యం గురించి తెలుసుకుంటుంది. అన్విత ప్రవర్తన, తీరు నచ్చి తనకంటే వయస్సులో పెద్దదైనా ప్రేమలో పడతాడు సిద్ధు. ఈ క్రమంలో ప్రేమ, పెళ్లి వద్దు తన బిడ్డకు జన్మనివ్వడానికి సహాయం కావాలంటుంది అన్విత. ఆ మాట విన్న సిద్ధు ఏం చేశాడు, అన్విత బిడ్డకు జన్మనిచ్చిందా లేదా అనేదే మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి కథ.

విశ్లేషణః

ఒక అమ్మాయి పెళ్లి కాకుండానే తల్లి కావాలనుకుంటుంది. వినడానికి ఆ అమ్మాయి నిర్ణయం సమాజానికి వింతగానే ఉండొచ్చు. సాటి మనుషులు హర్షించకపోవచ్చు. ఏ కుటుంబంలోనూ ఇలాంటి అమ్మాయి ఉండకపోవచ్చు. ఏ రకంగా ఆ అమ్మాయి తల్లి కావాలనుకుంటుందనే సందేహాలు తలెత్తొచ్చు. అలాంటి అంశాన్నే కథగా మలిచి సినిమా రూపంలోకి తీసుకొచ్చాడు దర్శకుడు మహేశ్ బాబు. దర్శకుడిగా ఒక సినిమానే చేసినా రెండో సినిమాకు ఇలాంటి వైవిధ్యమైన పాయింట్ తో సినిమాను తెరకెక్కించి శభాష్ అని నిరూపించుకున్నాడు. దానికి తోడు నవీన్ పొలిశెట్టి, అనుష్క లాంటి నటీనటులు తోడవడం సున్నితమైన పాయింట్ ప్రేక్షకుల్లోకి బలంగా వెళ్లింది. పిల్లలను కనాలంటే ఒకరికొకరు శారీరకంగా దగ్గరవ్వాల్సిన అవసరం లేదనే విషయాన్ని తన రచనలో అందంగా చూపించారు. రైటింగ్ లో ఏ మాత్రం గాడి తప్పినా సినిమా ఫలితం పూర్తిగా నిరాశపరిచేది. ఫస్టాప్ అన్విత IUI పద్దతిలో బిడ్డను కనేందుకు పడే తాపత్రయం, సిద్ధు స్టాండప్ కామెడీతో నవ్వులు పండించారు. సెకండాఫ్ లో వారిద్దిరి మధ్య సంఘర్షణ, అన్విత బిడ్డను కనడానికి గల బలమైన కారణం, క్లైమాక్స్ లో గర్బం దాల్చాక నిజమైన ప్రేమ కోసం అన్విత- సిద్ధుల పడే వేదన భావోద్వేగంగా సాగుతుంది. తండ్రీ కొడుకులుగా నవీన్- మురళీశర్మ ట్రాక్ ఆకట్టుకుంటుంది. మురళీశర్మ తో చెప్పించిన మాటలు అర్థవంతంగా ఉంటాయి. కథను నవ్వులతో నడిపిస్తూనే ఏమోషనల్ గా తీసుకెళ్లాడు దర్శకుడు మహేశ్. ఈ సినిమా విషయంలో దర్శకుడు మహేశ్ పనితీరును ప్రశంసించాల్సిందే. మాటలు ఆకట్టుకుంటూనే చప్పట్లు కొట్టేలా చేస్తాయి. నటీనటులుగా నవీన్ పొలిశెట్టి, అనుష్కలు ఇద్దరికి ఇద్దరు సాటే. ఎక్కడా ఎవరూ తగ్గకుండా చేశారు. జయసుధ, నాజర్ పాత్రలు అతిథి పాత్రలకే పరిమితం అయ్యాయి. పాటల పరంగా రథన్ మరింత దృష్టి పెడితే బాగుండేది. గోపిసుందర్ అందించిన నేపథ్య సంగీతం బాగుంది. నీరవ్ షా లెన్స్ అనుష్క అందాన్ని మరింత ఎలివేషన్ చేశాయి. బొద్దుగా ఉన్నా చాలా ముద్దుగా చూపించారు. నిర్మాణ పరంగా యూవీ క్రియేషన్స్ ఎక్కడా కాంప్రమైజ్ అయినట్టు కనిపించలేదు.

టాక్ ఏంటంటేః

మొత్తంగా మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి… క్లీన్ ఫ్యామిలీ కామెడీ ఎమోషనల్ డ్రామాగా ఇంటిల్లిపాదిని ఆకట్టుకుంటుంది. ఎక్కడా వల్గారిటీకి తావు ఇవ్వకుండా కథ, కథనాలను తీర్చిదిద్దిన విధానంతో ఈ సినిమా హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.