Miss Shetty Mr Polishetty: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ చెప్పేసిన నవీన్..

ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చాలా రోజులుగా నెమ్మదిగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఆగస్ట్ 4నవిడుదల చేస్తామంటూ ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది.

Miss Shetty Mr Polishetty: మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి వచ్చేస్తున్నారు.. రిలీజ్ డేట్ చెప్పేసిన నవీన్..
Miss Shetty Mr Polishetty

Updated on: Aug 14, 2023 | 11:15 PM

జాతి రత్నాలు సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్నారు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి. ఈ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ సినిమా తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకున్న నవీన్.. ప్రస్తుతం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా చాలా రోజులుగా నెమ్మదిగా జరుగుతుంది. ఈ చిత్రాన్ని యువీ క్రియేషన్స్ బ్యానర్ పై వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్నారు. లవ్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు మహేష్ బాబు. పి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే ఈ సినిమాను ఆగస్ట్ 4నవిడుదల చేస్తామంటూ ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక అందుకు తగినట్లుగానే ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల వాయిదా వేస్తున్నట్లు తెలియజేసింది.

ఇదిలా ఉంటే.. తాజాగా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేసింది చిత్రయూనిట్. కృష్ణాష్టమి రోజున అంటే సెప్టెంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ యూవీ క్రియేషన్స్ ఓ వీడియోను రిలీజ్ చేసింది. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్స్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఇవి కూడా చదవండి

యూవీ క్రియేషన్స్ ట్విట్..

ఈ సినిమాను తెలుగుతోపాటు, తమిళ, కన్నడ, మలయాళ బాషల్లో ఈ సినిమ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాహుబలి, నిశ్శబ్దం సినిమాల తర్వాత అనుష్క నటిస్తోన్న సినిమా ఇది. దాదాపు మూడేళ్ల తర్వాత వెండితెరపై కనిపించబోతుంది అనుష్క. ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అడియన్స్.

నవీన్ పోలిశెట్టి ఇన్ స్టా పోస్ట్.. 

నవీన్ పోలిశెట్టి ఇన్ స్టా పోస్ట్.. 

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.