Naveen Polishetty : ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ సినిమాతో ప్రేక్షకులకు హీరోగా పరిచయం అయ్యాడు నవీన్ పోలిశెట్టి. ఈ సినిమా కంటే ముందు పలు సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెప్పించాడు. మహేష్ నటించిన వన్ నేనొక్కడినే సినిమాలో మహేష్ అభిమానిగా.. అలాగే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ సినిమాలో కనిపించి ఆకట్టుకున్నాడు. ఇక మొదటి సినిమా ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయతోనే మొదటి హిట్ కూడా అందుకున్నాడు నవీన్. ఆ తర్వాత నాగ్ అశ్విన్ సమర్పణలో జాతిరత్నాలు సినిమా చేశాడు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సాధించింది. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన జాతిరత్నాలు సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
తాజాగా సంక్రాంతి సందర్భంగా కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు ఈ యంగ్ హీరో. నవీన్ పోలిశెట్టి హీరోగా ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థలు సంయుక్త నిర్మాణం లో ఓ చిత్రం రూపొందనుంది. ఈ సినిమాకు అనగనగా ఒక రాజు అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ఖరారు చేశారు. కళ్యాణ్ శంకర్ ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. ఈ వీడియోలో ఏదో పెళ్లికి సంభందించి ఏర్పాట్లు, హడావుడి గమనించవచ్చు. అలాగే పెళ్ళికొడుకు తయారవుతున్న తీరు కనిపిస్తుంది. ఫోటో షూట్ జరుగుతూ ఉంటుంది.. తన పెళ్లికి హీరో చేసే హడావుడిని ఈ వీడియో చూపించారు. పి.డి.వి. ప్రసాద్ సమర్పణలో రూపొందనున్న ఈ చిత్రానికి సంభందించిన మరిన్ని వివరాలను, విశేషాలను త్వరలోనే మరో సందర్భంలో మీడియాకు ప్రకటించనున్నట్లు ‘సితార ఎంటర్ టైన్మెంట్స్’, ‘ఫార్చ్యూన్ 4 సినిమాస్’ సంస్థల నిర్మాతలు సూర్య దేవర నాగవంశీ, శ్రీమతి సాయి సౌజన్య లు తెలిపారు. ఇక ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మరిన్ని ఇక్కడ చదవండి :