Colour Photo: ఓటీటీలో వచ్చి జాతీయ అవార్డు అందుకున్న చిన్న సినిమా .. ఇప్పుడు పెద్ద తెరపైకి కలర్ ఫోటో..

| Edited By: Ravi Kiran

Oct 25, 2022 | 9:00 AM

బెస్ట్ మూవీగా జాతీయ అవార్డు వరించింది. పీరియడ్‌ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ రాజ్‌ డైరెక్ట్ చేశారు. సుహాస్, షార్ట్ ఫిల్మ్స్‌ ఫేమస్ చాందినీ చౌదరీ హీరో హీరోయిన్లుగా నటించారు.

Colour Photo: ఓటీటీలో వచ్చి జాతీయ అవార్డు అందుకున్న చిన్న సినిమా .. ఇప్పుడు పెద్ద తెరపైకి కలర్ ఫోటో..
Colour Photo
Follow us on

చిన్న సినిమా గా వచ్చి ప్రేక్షకుల ఆదరణ అందుకున్న ‘కలర్ ఫోటో’(Colour Photo) సినిమాకు బెస్ట్ మూవీగా జాతీయ అవార్డు వరించింది. పీరియడ్‌ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాను సందీప్ రాజ్‌ డైరెక్ట్ చేశారు. సుహాస్, షార్ట్ ఫిల్మ్స్‌ ఫేమస్ చాందినీ చౌదరీ హీరో హీరోయిన్లుగా నటించారు. పోలీస్‌ క్యారెక్టర్లో.. పవర్‌ ఫుల్ విలన్‌గా సునీల్ కనిపించారు. కరోనా సంక్షోభం కారణంగా ఈ చిత్రాన్ని తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహాలో విడుదల చేశారు. కలర్‌ఫొటో సినిమా మూవీ లవర్స్‌ను ఆకట్టుకోవడమే కాదు.. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది.

ఈ చిత్రాన్ని థియేటర్‌లో చూడాలనుకుని మిస్సయిన సినీ లవర్స్‌ కు గుడ్‌ న్యూస్‌ అందించారు కలర్ ఫోటో మేకర్స్‌. ఈ చిత్ర నిర్మాత సాయిరాజేశ్‌, సందీప్‌ రాజ్‌ కలర్ ఫొటో థ్రియాట్రికల్‌ రిలీజ్‌ డేట్‌ను ప్రకటించారు. నవంబర్ 19న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా విడుదల చేస్తున్నట్టు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. సందీప్‌ రాజ్‌ కథనందించడంతో పాటు డైరెక్ట్‌ చేసిన ఈ చిత్రాన్ని అమృత ప్రొడక్షన్స్‌, లౌక్య ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ సంయుక్తంగా తెరకెక్కించాయి. హర్ష చెముడు, శ్రీదివ్య, సునీల్‌ ఇతరీ కలక పాత్రలు పోషించారు. కాలభైరవ కంపోజ్‌ చేసిన పాటలకు మంచి స్పందన వచ్చింది.